- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులకు అదనంగా మరో రూ.3 వేలు!.. రేపు మేనిఫెస్టోలో బీజేపీ కీలక హామీ?
దిశ, డైనమిక్ బ్యూరో:లోక్ సభ ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలు ప్రజలకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ మేరకు మేనిఫెస్టోలను విడుదల చేస్తున్నాయి. మూడో సారి అధికారంలోకి రాడవమే టార్గెట్ గా పెట్టుకున్న బీజేపీ రేపు తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో "సంకల్ప్ పాత్ర" పేరుతో మేనిఫెస్టోను రిలీజ్ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. ఈ సందర్భంగా రైతులకు బీజేపీ పార్టీ భారీ శుభవార్త చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి సాయం ప్రస్తుతం ఏడాదికి రూ.6 వేల ఇస్తుండగా దానికి అదనంగా మరో రూ.3 వేలు పెంచుతూ హామీతో పాటు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా స్కీమ్ కింద ప్రస్తుతం రూ.5 లక్షల వరకు వైద్యం అందిస్తుండగా దాని పరిమితి పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. న్యాయ్ పత్ర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ 5 న్యాయాలు, 25 గ్యారెంటీలతో మేనిఫెస్టో విడుదల చేసింది. పెద్ద ఎత్తున ప్రజలకు హామీల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎలాంటి తాయిలాలు ప్రకటించబోతున్నది అనేది ఆసక్తిగా మారింది.
ఈ లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ కోసం భారతీయ జనతా పార్టీ 27 మంది సభ్యులతో కూడిన ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి అధ్యక్షుడిగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వ్యవహించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను సమన్వయకర్తగా, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కో-ఆర్డినేటర్‌గా, వీరితో పాటు 24 మందిని ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ పలు దఫాలుగా భేటీ అయి చర్చించడంతో పాటు నమో యాప్ ద్వారా ప్రజల నుంచి సూచనలు, సలహాలను స్వీకరించారు. బీజేపీ మేనిఫెస్టోలో అభివృద్ధి, సుసంపన్న భారత్, మహిళలు, యువత, పేదలు, రైతులపై దృష్టి సారించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సాధించగల హామీలను మాత్రమే నెరవేరుస్తామని పార్టీ నేతలు చెబుతూ వస్తున్నారు. ‘‘మోదీ గ్యారెంటీ: 2047 నాటికి వికసిత భారత్’ థీమ్‌తో ఈసారి మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.