అనిల్ ఆంటోనీ బీజేపీలో చేరడంపై ఆయన సోదరుడు కీలక వ్యాఖ్యలు

by Harish |   ( Updated:2023-04-07 16:28:13.0  )
అనిల్ ఆంటోనీ బీజేపీలో చేరడంపై ఆయన సోదరుడు కీలక వ్యాఖ్యలు
X

తిరువనంతపురం: కాంగ్రెస్ మాజీ నేత అనిల్ ఆంటోనీ బీజేపీ చేరడంపై ఆయన సోదరుడు అజిత్ ఆంటోనీ కీలక వ్యాఖ్యలు చేశారు. అనిల్‌ను కాషాయ పార్టీ వాడుకుంటుందని, ఆ తర్వాత కరి వేపాకులా తీసివేస్తుందని అన్నారు. అనిల్ బీజేపీలో చేరడం అందరిని విస్మయానికి గురి చేసిందని చెప్పారు. తన తండ్రి ఏకే ఆంటోనీ దీనిని చూసి బాధతో ఉన్నారని అన్నారు. తన జీవితంలో ఆయన ఇంత బాధపడటం ఎప్పుడూ చూడలేదని తెలిపారు. అయితే అనిల్ వ్యక్తిగత కారణాలతోనే బీజేపీలో చేరారని చెప్పారు. బహుశా కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు కాల్ చేసి వేధించడం ఆయనను బాధపెట్టించి ఉండవచ్చని అన్నారు. బీజేపీ అవసరానికి మాత్రమే వాడుకుంటుందని, అనిల్ తన తప్పులు తెలుసుకుని కాంగ్రెస్‌లోకి తిరిగి వస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. కాగా, గురువారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో అనిల్ ఆంటోనీ బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇది చాలా బాధాకరమని ఆయన తండ్రి ఏకే ఆంటోనీ అన్నారు.

Advertisement

Next Story