Ananda Krishnan: ఎయిర్‌సెల్ అధినేత ఆనంద కృష్ణన్ మృతి

by Maddikunta Saikiran |   ( Updated:2024-12-01 15:34:28.0  )
Ananda Krishnan:  ఎయిర్‌సెల్ అధినేత ఆనంద కృష్ణన్ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: మలేషియా(Malaysia)కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త, ఎయిర్‌సెల్(Aircel) అధినేత తాన్ శ్రీ ఆనంద కృష్ణన్(T. Ananda Krishnan) మృతి చెందారు. ఈ మేరకు ఈ విషయాన్ని మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం(Anwar Ibrahim) ఎక్స్(X)లో తెలిపారు. 'కార్పొరేట్ ప్రపంచానికి కృష్ణన్ ఎనలేని సేవలందించారు. అనేక దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించారు. సమాజానికి కృష్ణన్ చేసిన కృషి మరువలేనిది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' అని ఇబ్రహీం అన్నారు. కాగా ఆనంద కృష్ణన్ మలేషియా రాజధాని కౌలాలంపూర్(Kuala Lumpur)లోని బ్రిక్ ఫీల్డ్(Brickfield)లో ఏప్రిల్ 1, 1938న జన్మించారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ పట్టా పొందారు. తర్వాత వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చి మలేషియాలోని సంపన్న వ్యక్తులలో ఒకరిగా నిలిచారు. టెలికమ్యూనికేషన్స్ , శాటిలైట్, చమురు, గ్యాస్, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఆయనకు వ్యాపారాలు ఉన్నాయి. ఫోర్బ్స్ ప్రకారం అతని ఆస్తుల విలువ 5 బిలియన్ డాలర్లు(ఇండియన్ కరెన్సీలో రూ. 40,000 కోట్లు)గా ఉంది. కాగా ఆనంద కృష్ణన్ టెలికాం కంపెనీ ఎయిర్‌సెల్ ఒకప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌(CSK) కు స్పాన్సర్(Sponsor)గా వ్యవరించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story