- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నువ్వు గ్రేట్ బామ్మ.. 70 ఏళ్ల బామ్మ సమయస్ఫూర్తితో తప్పిన పెను ప్రమాదం
దిశ, డైనమిక్ బ్యూరో : ఆమెకు హార్ట్ ఆపరేషన్ జరిగింది. ఇంట్లో రెస్ట్ తీసుకుంటోంది. ఓ రోజు మధ్యాహ్నం సమయంలో ఇంటి ముందు నిలబడి ఉండగా, ట్రాక్‌పై చెట్టు పడిపోయి ఉండడం గుర్తించింది. తన సమయస్ఫూర్తితో చేసిన ఓ పనితో పెను ముప్పు తప్పింది. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన చంద్రవతి అనే 70 ఏళ్ల మహిళ స్థానికంగా రైల్వే ట్రాక్ సమీపంలో నివసిస్తున్నారు. మార్చి 21వ తేదీ మధ్యాహ్నం సమయంలో తన ఇంటి ముందు నిలబడి ఉండగా..ట్రాక్‌పై ఓ చెట్టు పడిపోవడాన్ని ఆమె గుర్తించారు. ఆ సమయంలో రోజూ ఆ పట్టాలపై మంగళూరు నుంచి ముంబయికి వెళ్లే మత్స్యగంధ ఎక్స్‌ప్రెస్ వస్తుందని ఆమెకు ముందే తెలుసు. దీంతో వెంటనే అప్రమత్తమైన చంద్రవతి రైలు శబ్దాన్ని విని ఇంట్లోకి పరుగుపెట్టి ఎర్రటి వస్త్రాన్ని తీసుకొచ్చింది. రైలుకు ఎదురుగా వెళ్లి ఆ వస్త్రాన్ని ఊపి రైలు ఆపేలా చేసింది. ఎరుపు వస్త్రాన్ని గమనించిన ఆ రైలు లోకోపైలట్ వేగాన్ని నెమ్మది చేశారు. దీంతో సరిగ్గా చెట్టు పడిపోయిన ప్రాంతం వద్ద రైలు ఆగడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం రైల్వే అధికారులు, స్థానికులు ట్రాక్ వద్దకు చేరుకుని ఆ చెట్టును తొలగించారు. అతి తక్కువ సమయంలో ఆమె సమయస్ఫూర్తితో వ్యవహరించి వందల మంది ప్రాణాలను కాపాడారు. ఆమె గురించి తెలుసుకున్న ఉన్నతాధికారులు ఇటీవల చంద్రవతిని సత్కరించారు.