Amith Shah: డ్రగ్స్‌‌పై ఉక్కుపాదం మోపాల్సిందే: కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

by Shiva |
Amith Shah: డ్రగ్స్‌‌పై ఉక్కుపాదం మోపాల్సిందే: కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాల్సిందేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌లో నార్కోటిక్ బ్యూరో జోనల్ ఆఫీసును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంకేతికతను ఉపయోగించి డ్రగ్స్ నెటవర్క్‌ను సమూలంగా నాశనం చేయాలని అన్ని రాష్ట్రాల పోలీసు శాఖలను ఆదేశించారు. కేవలం డ్రగ్స్‌తో రెడ్‌హ్యాండె‌డ్‌గా పట్టుబడిన వారిని అరెస్ట్ చేసి ఊరుకొవద్దని సూచించారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి ఎక్కడి సరఫరా అవుతున్నాయి.. ఎవరెవరికి చేరుతున్నాయో సంపూర్ణ విచారణ జరపాలని ఆదేశించారు.

నేడు డ్రగ్స్ నెట్‌వర్క్‌ను ఛేదించి కఠిన చర్యలు తీసుకోకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసిన ఉపయోగం ఉండదని అన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం కూడా ఉందని తెలపారు. అదే డబ్బును కొందరు అక్రమార్కులు ఉగ్రవాదం, నక్సలిజం కోసం వినియోగిస్తున్నారని మండిపడ్డారు. డ్రగ్స్ అక్రమ రవాణా మన దేశానికి మాత్రమే కాదు ప్రపంచ మానవాళి సవాలు అని పేర్కొన్నారు. గట్టి సంకల్పంతోనే ముప్పును ఎదుర్కోగలుగుతామని తెలిపారు. డ్రగ్స్ అక్రమ రవాణా కట్టడికి నాలుగు సూత్రాలు పాటించాలన్నారు. మొదటగా డ్రగ్స్ను గుర్తించాలని, రెండో అంశంగా రవాణా వ్యవస్థ విచ్ఛిన్నం చేయాలని, మూడో అశంగా దోషులపు పట్టుకోవాలని, చివరగా డ్రగ్స్‌కు అలవాటైన వారిని ఆ లోకం నుంచి బయటకు తీసుకొచ్చేలా డీ-అడిక్షన్ ప్రొగ్రాంలను నిర్వహించాలని అమిత్ షా దిశానిర్దేశం చేశారు.

Advertisement

Next Story

Most Viewed