- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Amit Shah: మూడేళ్లలోనే యమునా నదిని శుభ్రం చేస్తాం- అమిత్ షా

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు (Delhi Assembly Elections) సంబంధించి ఆఖరి మేనిఫెస్టోను బీజేపీ (BJP manifesto) విడుదల చేసింది. సంకల్ప పత్ర’ పార్ట్-3 పేరుతో మేనిఫెస్టోను కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah) విడుదల చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. తమ మేనిఫెస్టోలో బూటకపు వాగ్దానాలు ఉండవన్నారు. ‘‘బీజేపీ ‘సంకల్ప పత్రం’లో బూటకపు హామీలు లేవు. దేశరాజధానిలో చేపట్టాల్సిన పనుల లిస్ట్ మాత్రమే ఉంది. ఎన్నడూ లేని విధంగా కేజ్రీవాల్ నేతృత్వంలో అవినీతి మరింతగా పెరిగిపోయింది. ఢిల్లీకి చేసిన హామీలను నెరవేర్చడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైంది. కలుషితమైన యుమునా నదిని శుభ్రం చేయించడంలో కేజ్రీవాల్ ఫెయిల్ అయ్యారు. ప్రజలకు సరైన తాగునీటి సౌకర్యం అందించలేదు. ఢిల్లీని కాలుష్య రహితంగా మార్చలేదు.’’ అని అమిత్ షా విమర్శించారు.
సంక్షేమపథకాలు నిలిపివేయబోం..
పేదల కోసం రూపొందించిన సంక్షేమ పథకాలను నిలిపివేయబోమని అమిత్ షా చెప్పుకొచ్చారు. బీజేపీ మేనిఫెస్టోలో ఢిల్లీలో రోడ్ల నిర్మాణానికి రూ. 41 వేల కోట్లు, రైల్వే లైన్ల కోసం రూ. 15 వేల కోట్లు, ఎయిర్‌పోర్టుకు రూ. 21 వేల కోట్లను కేంద్రం అందిస్తుందని అన్నారు. ఇచ్చిన హామీలను కచ్చితంగా బీజేపీ నెరవేరుస్తుందన్నారు. కాషాయపార్టీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో యమునా నదిని పూర్తిగా శుభ్రం చేయిస్తామన్నారు. గిగ్ వర్కర్ల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామన్నారు. 1,700 అనధికార కాలనీలలో కొనుగోలు, అమ్మకంతో పాటు నిర్మాణం ఇలా పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తామన్నారు. రూ. 10 లక్షల ఆరోగ్య బీమా, రూ.5 లక్షల ప్రమాద బీమా అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే, సంకల్పపత్ర 1, 2 పేరుతో బీజేపీ మేనిఫెస్టోలను విడుదల చేసింది. ఇకపోతే, 70 శాసనసభ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఫలితాలు రానున్నాయి.