Amit Shah: అక్రమ చొరబాట్లు అడ్డుకున్నప్పుడే బెంగాల్‌లో శాంతి.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా

by vinod kumar |
Amit Shah: అక్రమ చొరబాట్లు అడ్డుకున్నప్పుడే బెంగాల్‌లో శాంతి.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లను అడ్డుకున్నప్పుడే పశ్చిమ బెంగాల్‌(west Bengal)లో శాంతి నెలకొంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఈ చర్యలను నియంత్రిస్తామని నొక్కి చెప్పారు. ఉత్తర 24 పరగణాస్ జిల్లా భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులోని పెట్రాపోల్ ల్యాండ్ పోర్ట్‌ (Petrapole land port)లో కొత్తగా నిర్మించిన ప్యాసింజర్ టెర్మినల్ భవనం( passenger terminal building), కార్గో గేట్‌ (cargo gate)ని అమిత్ షా ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. 2026లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను అరికడతామన్నారు. రాష్ట్రంలో శాశ్వతంగా శాంతి నెలకొనాలంటే రాజకీయ మార్పు తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీఎంసీ(Tmc) హయాంలో పశ్చిమ బెంగాల్ పూర్తి అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు.

‘శాంతిని నెలకొల్పడంలో ల్యాండ్ పోర్ట్‌ (land port)లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సరిహద్దుల గుండా ప్రజల చట్టపరమైన కదలికలకు అవకాశం లేనప్పుడు, చట్టవిరుద్ధమైన కదలికలు తలెత్తుతాయి. ఇది దేశంలో శాంతిని ప్రభావితం చేస్తుంది. 2026లో మార్పు తీసుకురావాలని బెంగాల్ ప్రజలను కోరుతున్నా’ అని వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య కనెక్టివిటీ, సంబంధాలను మెరుగుపర్చడంలో ల్యాండ్ పోర్ట్‌లు కీలకంగా వ్యవహరిస్తాయని తెలిపారు. వాణిజ్య సంబంధాలు సైతం మెరుగుపడే అవకాశం ఉందని చెప్పారు. ల్యాండ్ పోర్ట్‌లు చట్టపరమైన కదలికను నిర్ధారిస్తే.. అక్రమ వలసలను నియంత్రించడం కూడా సులభమవుతుందని అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story