- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గల్వాన్‌లో ‘1962’ సీన్ రిపీట్ చేసేందుకు చైనా యత్నించింది: అమిత్ షా
దిశ, నేషనల్ బ్యూరో : 2020 సంవత్సరంలో తూర్పు లడఖ్‌లో చైనాతో సాగిన సైనిక ప్రతిష్టంభనలో భారత్ ఏ భూభాగాన్ని కూడా కోల్పోలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టంచేశారు. తూర్పు లడఖ్‌లో బరితెగించిన చైనా 1962 నాటి సీన్‌ను రిపీట్ చేసేందుకు యత్నించిందని మండిపడ్డారు. ‘‘మా నాయకత్వం బలమైన సంకల్పాన్ని ప్రదర్శించింది. భారతదేశపు అంగుళం భూమి కూడా పోకుండా కాపాడింది’’ అని అమిత్ షా శనివారం లోక్‌సభకు తెలిపారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పదేపదే తప్పుడు ప్రచారం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. వివాదాస్పద సరిహద్దు వెంట శాంతి, ప్రశాంతతను కొనసాగించడానికి ఆర్మీని వెనక్కి పిలుచుకోవడం ఒక్కటే మార్గమని చైనాకు తాము తేల్చి చెప్పామన్నారు. 2020 సంవత్సరం జూన్ 15న రాత్రి గల్వాన్ లోయలో జరిగిన రక్తపాత ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. నలుగురు సైనికులు చనిపోయారని చైనా వెల్లడించింది. అయితే చైనా సైనికుల మరణాల సంఖ్య అంతకంటే ఎక్కువే ఉంటుందని అంటున్నారు. దీనికి సంబంధించిన శాంతి చర్చలను భారత్ - చైనా ఎట్టకేలకు గత ఏడాది ఏప్రిల్-మే చివర్లో ప్రారంభించాయి. ఆ చర్చలు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం.