- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BJP ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసిన అమిత్ షా
దిశ, వెబ్‌డెస్క్: ఝార్ఖండ్ (Jharkhand) ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని కేంద్రం హోం మంత్రి అమిత్ షా (Central Home Minister Amit Shah) అన్నారు. ఈ అవినీతిని అంతం చేయాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని, అందువల్ల ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ (BJP) తమ మేనిఫెస్టోని విడుదల చేసింది. పార్టీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ మేనిఫెస్టో (Manifesto)ను నేడు (ఆదివారం) విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ చెప్పిందల్లా చేస్తుందని, ఇప్పటివరకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశామని చెప్పారు. ఇక్కడ కూడా అధికారంలోకి రాగానే రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తామని, ప్రజలు తమపై నమ్మకముంచి అధికారం కట్టబెట్టాలని కోరారు.
‘‘మీకు ఎలాంటి ప్రభుత్వం కావాలి? మీ కడుపుకొట్టి, మీ ఆడబిడ్డలకి రక్షణ కల్పించలేని, మీ భూమిని దోచుకునే ప్రభుత్వం కావాలా..? లేక మీకు అన్ని రకాలుగా అండగా ఉండే ప్రభుత్వం కావాలా..? రాష్ట్రాన్ని ది బెస్ట్‌గా మార్చాలంటే బీజేపీకి ఓటేసి గెలిపించండి’’ అని అమిత్ షా పిలుపునిచ్చారు.