- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Lakshadweep : లక్షద్వీప్‌లో రెండు మిలిటరీ ఎయిర్‌బేస్‌లు
దిశ, నేషనల్ బ్యూరో : చైనాకు చెక్ పెట్టేలా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. లక్షద్వీప్‌లో రెండు సైనిక వైమానిక స్థావరాల ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గురువారం ఢిల్లీలో జరిగిన ప్రభుత్వ ఉన్నత స్థాయి సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంది. లక్షద్వీప్‌లోని మినికాయ్ దీవుల్లో కొత్త ఎయిర్‌బేస్‌ను నిర్మించడంతో పాటు అగట్టి ద్వీపంలో ఇప్పటికే ఉన్న ఎయిర్ బేస్‌ను విస్తరించాలని త్రివిధ దళాల చీఫ్‌లతో కూడిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ చేసిన ప్రతిపాదనకు కేంద్ర సర్కారు పచ్చజెండా ఊపింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా ఆర్మీ కదలికలపై పకడ్బందీ నిఘాను ఉంచేందుకే ఈ మిలిటరీ ఎయిర్‌బేస్‌లను రెడీ చేస్తున్నారు.
సైనిక అవసరాలతో పాటు పౌర విమానయాన అవసరాలకూ ఉపయోగపడేలా వీటిని నిర్మించనున్నారు. సుదూర లక్ష్యాలు ఛేదించగల డ్రోన్లు, యుద్ధ విమానాలు, రవాణా విమానాలను కూడా ఈ ఎయిర్ బేస్‌ల నుంచి మోహరించే వీలు ఉంటుంది. వీటిని నిర్మించాక తొలుత వాయుసేన కోసం అందుబాటులోకి తెస్తారు. వాస్తవానికి మినికాయ్ దీవుల్లో ఎయిర్ బేస్‌ను నిర్మించాలని తొలిసారిగా ఇండియన్ కోస్ట్‌గార్డ్ ప్రతిపాదించింది. కీలకమైన మినికాయ్ దీవులు మాల్దీవులకు కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అందుకే అక్కడ వైమానిక సేవలు మొదలైతే టూరిజం రెక్కలు తొడగనుంది.