తొలిరోజు 13 వేలమందికి మంచులింగ దర్శనం

by Hajipasha |
తొలిరోజు 13 వేలమందికి మంచులింగ దర్శనం
X

దిశ, నేషనల్ బ్యూరో : పవిత్ర అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభమైంది. శనివారం తెల్లవారుజామునే జమ్మూకశ్మీర్‌లోని బాల్టాల్, నున్‌వాన్‌లోని బేస్ క్యాంపుల నుంచి యాత్రికులు హిమాలయాల్లో 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్‌నాథ్‌ గుహకు బయలుదేరారు. యాత్ర ప్రారంభమైన సందర్భంగా ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తదితరులు యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపారు.

తొలిరోజు 13 వేలమందికిపైగా భక్తులు మంచులింగాన్ని దర్శించుకున్నారు. కేంద్రప్రభుత్వ సంస్థ ‘ఓఎన్‌జీసీ’ యాత్రికుల సౌకర్యార్ధం కశ్మీర్‌లోని రెండు బేస్‌ క్యాంపుల్లో 100 పడకల ఆస్పత్రులను ఏర్పాటు చేసింది. యాత్ర అనంతరం కూడా వైద్య సేవలు కొనసాగుతాయని వెల్లడించింది. అనంతనాగ్‌ జిల్లాలోని రెండు మార్గాల మీదుగా పవిత్ర అమర్‌నాథ్ గుహకు ఆగస్టు 19 వరకు 52 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది.

Advertisement

Next Story

Most Viewed