- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Allahabad HC: విడుదలైన మూడు నెలల్లో బాధితురాల్ని పెళ్లి చేసుకోవాలి

దిశ, నేషనల్ బ్యూరో: మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి అలహాబాద్ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. విడుదలైన మూడు నెలల్లోగా బాధితురాలిని వివాహం చేసుకోవాలని ఆదేశించింది. ఫిబ్రవరి 20న జస్టిస్ క్రిషన్ పహల్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఆర్టికల్ 21 ప్రకారం ఒక వ్యక్తి జీవించే హక్కుని, స్వేచ్ఛను హరించలేమని కోర్టు పేర్కొంది. నేరాన్ని నిరూపించే వరకు అతడి హక్కుల్ని హరించలేమంది. ఇకపోతే, రాజస్థాన్‌లోని సికార్ జిల్లాకు చెందిన నిందితుడు.. గతేడాది పోలీసు నియామక పరీక్షల కోచింగ్ సెంటర్ లో బాధితురాల్ని కలిశాడు. గతేడాది ఫిబ్రవరి నుంచి బాధితురాలిపై పలుమార్లు లైంగికవేధింపులకు పాల్పడ్డని ఆమె కుటుంబం ఆరోపించింది. మేలోనే నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై ఐపీసీ సెక్షన్లు 376 (అత్యాచారం), 506 (నేరపూరిత బెదిరింపు), ఐటీ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సెప్టెంబర్ 21న నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే, అక్టోబర్ లో నిందితుడికి ఆగ్రా సెషన్స్ కోర్టు బెయిల్ ని తిరస్కరించింది. దీంతో, అతడు అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించాడు. నిందితుడు యూపీ పోలీసు శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి బాధితురాలితో శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆమె తరఫు న్యాయవాది పేర్కొన్నారు. అంతేకాకుండా, లైంగిక దాడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు విడుదల చేస్తానని బెదిరించి ఆమె నుంచి రూ.9 లక్షలు వసూలు చేశాడని ఆరోపించారు. కాగా.. బాధితురాలిని పెళ్లి చేసుకోవాలన్న షరతుతో హైకోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. అయితే, కోర్టు విధించిన షరతులను పాటిస్తామని నిందితుడి తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.