- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీ ప్రసంగాలన్నీ అబద్దాలే: కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ
దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని మోడీ ఎన్నికల ప్రసంగాల్లో మాట్లాడిన మాటలన్నీ అబద్దాలేనని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ విమర్శించారు. ప్రజలకు సేవ చేయడం కోసం కాకుండా కేవలం అధికారం కోసం మాత్రమే రాజకీయాలను ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. మహారాష్ట్రలోని నందుర్భార్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి గోవాల్ పద్వీకి మద్దతుగా శనివారం నిర్వహించిన ర్యాలీలో ప్రియాంక ప్రసంగించారు. మోడీ ఆదివాసీలను ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. ప్రతి ఒక్కరి సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించడం రాజకీయ నేతల కర్తవ్యమని, కానీ ఆదివాసీల సంస్కృతిని బీజేపీ గౌరవించడం లేదన్నారు. రామమందిర ప్రారంభోత్సవం, నూతన పార్లమెంటు భవన శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్రపతి ముర్మును ఆహ్వానించకుండా అవమానించారని మండిపడ్డారు. ఇంధిరా గాంధీని చూసి మోడీ ఎంతో నేర్చుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి మాటలకు పెద్దగా గౌరవం లేకపోవడమే కాకుండా గత 10 ఏళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాల గురించి ప్రజలకు చెప్పే ధైర్యం కూడా లేదని మండిపడ్డారు.