- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jantar Mantar: వైఎస్ జగన్ దీక్షకు మద్దతు తెలిపిన అఖిలేష్ యాదవ్
దిశ, నేషనల్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) నిరసన చేపట్టింది. ధర్నాకు సమాజ్‌వాదీ పార్టీ(SP) అధినేత అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) ఆ దీక్షకు సంఘీభావం తెలిపారు. బుధవారం మధ్యాహ్నాం ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన అధినేత అఖిలేష్ యాదవ్.. తన పార్టీ మద్దతు ప్రకటించారు. ఆ సమయంలో ఏపీలోని పరిస్థితులను వీడియోల ద్వారా అఖిలేష్‌కు జగన్ వివరించారు. ఆతర్వాత అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.
అఖిలేష్ ఏమన్నారంటే?
అఖిలేష్ మాట్లాడుతూ.. “రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజం. అధికారంలో ఉన్నవారు సంయమనం పాటించాలి. ప్రజల సమస్యలు పట్టించుకోవాలి. ఎదుటివారు చెప్పేది వినాలి. అంతేకానీ, వారి ప్రాణాలు తీయకూడదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ, ఆ వెంటనే ప్రతిపక్ష పార్టీపై దాడులు మొదలుపెట్టినట్లు.. ఈ ఫోటోలు, వీడియోలు చూసిన తరవాత అర్ధమైంది. పట్టపగలే దాడులు చేయడం, హత్య చేయడం, వారి ఆస్తులు ధ్వంసం చేయడం, ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఉన్న వారిపై అక్రమంగా కేసులు నమోదు చేయడం, వేధించడం.. అలాగే ఎన్నికైన ప్రజాప్రతినిధులపై ఏకంగా హత్యాయత్నం చేయడం.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఎన్డీఏ కూటమి నేర రాజకీయాలు చేయవద్దు. ఇలాంటి ఘటనలను సమర్థించొద్దు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ జగన్‌కు మద్దతు ఉంటుంది. ఇలాంటి పరిస్థితి రేపు మరెవరికైనా జరగొచ్చు. అన్యాయానికి వ్యతిరేకంగా మేమెప్పుడూ పోరాడతాం. అలాంటి వారికి అండగా నిలబడతాం’ అని అన్నారు.