- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శరత్ పవార్ కు అజిత్ ధన్యవాదాలు.. బాబాయ్, అబ్బాయ్ కలిసిపోయినట్లేనా?
దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల్లో ఎన్సీపీ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వర్గానికి షాక్ తగిలింది. ఐదు స్థానాల్లో పోటీ చేసిన అజిత్ పవార్ ఎన్సీపీ.. కేవలం ఒక్క స్థానంలోనే గెలిచింది. మరోవైపు, శరద్ పవార్ వర్గం 10 స్థానాల్లో పోటీ చేస్తే.. 8 చోట్ల విజయం సాధించింది. ఇలాంటి టైంలో అజిత్ పవార్ తన బాబాయ్ శరద్ పవార్ కు ధన్వాదాలు తెలిపారు. ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఎన్సీపీ స్థాపించి 24 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ముంబైలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్ని అజిత్.. శరద్ పవార్ కు ధన్యవాదాలు తెలిపారు.
పార్టీ ఫిరాయింపులపై హింట్
అజిత్ పవార్ మాట్లాడుతూ.. 1999లో స్థాపించిన ఎన్సీపీ ఎంతో ప్రజాదరణ సొంతం చేసుకుందన్నారు. 24 ఏళ్లుగా పార్టీని శక్తివంచన లేకుండా ముందుకు నడిపిన శరద్ పవార్‌కు ధన్యవాదాలు తెలిపారు. కేంద్రమంత్రివర్గంలో తమకు చోటు దక్కకపోవడంపై మరోసారి అసంతృప్తి తెలిపారు. మంత్రివర్గంలో ఎన్సీపీకి అవకాశాలు వచ్చాయని అన్నారు. కానీ, క్యాబినెట్ కంటే తక్కువ స్థాయి పదవిలో మేము కొనసాగలేమని ఇప్పటికే బీజేపీకి స్పష్టం చేశామన్నారు. తమ పార్టీ ఇప్పటికీ ఎన్డీయేలో భాగమే అని గుర్తుచేశారు. భవిష్యత్తులో ఎన్డీఏ కూటమి 300 మార్క్‌ను దాటడం ఖాయమని పార్టీ ఫిరాయింపులపై హింట్ అన్నారు.