Ajay Maken: ఆప్ రూ.382 కోట్ల అవినీతికి పాల్పడింది.. కాంగ్రెస్ సంచలన ఆరోపణలు

by vinod kumar |
Ajay Maken: ఆప్ రూ.382 కోట్ల అవినీతికి పాల్పడింది.. కాంగ్రెస్ సంచలన ఆరోపణలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ హెల్త్ కేర్ రంగంలో ఆమ్ ఆద్మీ పార్టీ (Aap) ప్రభుత్వం రూ.382 కోట్ల అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ (Ajay maken) ఆరోపించారు. ఇటీవల వెలువడిన 14 కాగ్ (Cag) నివేదికలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తమ పనిని సమయానికి ముందే పూర్తి చేస్తామని, డబ్బు కూడా ఆదా చేస్తామని ఆప్ హామీ ఇచ్చినట్టు గుర్తు చేశారు. కానీ పదేళ్లలో కేవలం మూడు కొత్త ఆస్పత్రులు మాత్రమే నిర్మించారని తెలిపారు. ఈ మూడు ఆస్పత్రులకు కూడా కాంగ్రెస్ హయాంలోనే శంకుస్థాపన జరిగిందని చెప్పారు.

ఇందిరా గాంధీ (Indira Gandhi) ఆస్పత్రికి తమ పాలనలో ఖరారు చేసిన టెండర్ కంటే అదనంగా రూ.314 కోట్లు ఖర్చు చేశారని, అలాగే బురారీ (Burari) ఆస్పత్రికి రూ. 41కోట్లు, మౌలానా ఆజాద్ డెంటల్ ఆస్పత్రికి రూ. 26 కోట్లు ఎక్కువగా ఖర్చు చేశారని తెలిపారు. మొత్తం రూ.382.52 కోట్లు అదనంగా వెచ్చించారని కాగ్ నివేదిక చెబుతోందన్నారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన ఆప్ అవినీతిలో కూరుకుపోవడం ఆశ్చర్యపర్చిందన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ అజయ్ మాకెన్ ఆరోపణలు హాట్ టాపిక్‌గా మారాయి. కాగా, ఫిబ్రవరి 5న ఢిల్లీలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.



Next Story

Most Viewed