Air India : విమానాల్లో ‘హలాల్’ భోజనం‌పై ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం

by Sathputhe Rajesh |
Air India : విమానాల్లో ‘హలాల్’ భోజనం‌పై ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో : హిందూ, సిక్కు ప్రయాణీకులకు విమానాల్లో హలాల్ భోజనం అందించడాన్ని ఆపేస్తున్నట్లు టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిర్ ఇండియా సంస్థ ప్రకటించింది. అయితే ముస్లిం ప్రయాణీకులు ముందే తమ భోజనాన్ని ప్రీ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది. ఎయిర్ ఇండియా విమానాల్లో ఆహారం విషయంలో పలుమార్లు వివాదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. విభిన్న ఆహార అలవాట్లను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు విమాన సంస్థ వెల్లడించింది. సౌదీ అరేబియాలోని జెడ్డా, దమ్మమ్, రియాద్, మెదినా, హజ్‌కు వెళ్లే విమానాల్లో మాత్రం మొత్తం హలాల్ సర్టిఫైడ్ మీల్స్ అందించనున్నట్లు సంస్థ క్లారిటీ ఇచ్చింది. MOML స్టిక్కర్ ఉంటే ముస్లిం భోజనంగా పరిగణించాలని వెల్లడించింది. SPML అని లేబుల్ ఉంటే స్పెషల్ మీల్‌గా గుర్తించాలని కోరింది.

Advertisement

Next Story

Most Viewed