Air India: ఎయిరిండియాకు డీసీసీఏ బిగ్ షాక్.. భారీ జరిమానా విధింపు

by Shiva |
Air India: ఎయిరిండియాకు డీసీసీఏ బిగ్ షాక్.. భారీ జరిమానా విధింపు
X

దిశ, వెబ్‌డెస్క్: విమానయాన నియమ నిబంధనలను అతిక్రమించినందుకు గాను ఎయిరిండియా సంస్థకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) భారీ జరిమానా విధిస్తూ.. బిగ్ షాక్ ఇచ్చింది. పైలెట్లకు విశ్రాంతిని కల్పించకుండా నిరంతరం డ్యూటీలు వేస్తూ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్, ఫెటీగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ రెగ్యులేషన్స్ అతిక్రమించినందుకు రూ.80 లక్షల భారీ జరిమానా విధించింది. కాగా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిరిండియా విమానంలో అడిట్ నిర్వహించింది. ఆ సమయంలో ఇద్దరు పైలట్లు 60 ఏళ్లకు మించి వయసున్న వారు ఉన్నారని తేలింది. అంతేకాదు పైలట్ల డ్యూటీ, ట్రిప్‌ల తర్వాత, ముందు విశ్రాంతి ఇచ్చే విషయంల్లో నియమ నిబంధనలు పాటించ లేదంటూ డీజీసీఏ రూ.80లక్షలు ఫైన్ విధించింది.

Advertisement

Next Story

Most Viewed