- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అజిత్ పవార్ తిరుగుబాటు మా ఐక్యతపై ప్రభావం చూపదు.. కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్
దిశ, వెబ్ డెస్క్: ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ తిరుగుబాటు వ్యవహారంపై ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అజిత్ పవార్ వ్యవహారం వల్ల మహా వికాస్ అఘాడీ కూటమిపై ఏమాత్రం ప్రభావం చూపదని అన్నారు. అది ఎన్సీపీకి సంబంధించిన వ్యవహారమని అన్నారు. పవార్ దేశరాజకీయాల్లో శరద్ పవార్ చాలా పెద్ద నాయకుడని, పార్టీ సంక్షోభాన్ని ఎలా తట్టుకొని నిలబడాలో ఆయనకు తెలుసునని అన్నారు. ఇక ప్రతిపక్షపార్టీల ప్రభుత్వాలను, పార్టీలను కూలగొట్టడం లక్ష్యంగా మోడీ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
అందుకోసం ఆయన ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలను వాడుకుంటున్నారని అన్నారు. ఎన్సీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని ప్రధాని ఆరోపించిన రెండు రోజుల్లోనే అజిత్ పవార్ అక్కడి ప్రభుత్వంలో జాయిన్ కావడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఇదంతా డ్రామా అని ఆరోపించిన ఆయన.. మోడీ కనుసన్నల్లోనే మహారాష్ట్ర తాజా ఎపిసోడ్ నడుస్తోందని చెప్పారు.