- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భారత వాయుసేన మాజీ అధిపతి పొలిటికల్ ఎంట్రీ.. అక్కడి నుంచే పోటీ ?
దిశ, నేషనల్ బ్యూరో : భారత వాయుసేన మాజీ అధిపతి ఆర్.కె.సింగ్ భదౌరియా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆదివారం ఉదయం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వేదికగా ఆయన కమలదళంలో జాయిన్ అయ్యారు. బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ థావడే, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. ఈసందర్భంగా భదౌరియా మాట్లాడుతూ.. దేశ నిర్మాణానికి సహకరించేందుకు మరోసారి అవకాశాన్ని ఇచ్చినందుకు బీజేపీకి ధన్యవాదాలు తెలిపారు. ‘‘నేను భారత వాయుసేనలో నాలుగు దశాబ్దాలకుపైగా పనిచేశాను. కానీ,నా సర్వీసులో అత్యుత్తమ సమయం మాత్రం గత ఎనిమిదేళ్ల బీజేపీ ప్రభుత్వంలోనిదే. సైన్యం సాధికారత, ఆధునీకరణ, స్వావలంబన కోసం మోడీ సర్కారు చర్యలు తీసుకుంటోంది. దీని వల్ల భద్రతా బలగాలు కొత్త సామర్థ్యాన్ని, కొత్త విశ్వాసాన్ని పొందుతాయి. ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని కొత్త శిఖరాలకు చేర్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీదే’’ అని వాయుసేన మాజీ చీఫ్ కొనియాడారు.
యూపీ నుంచి లోక్‌సభకు పోటీ ?
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా ఎయిర్ చీఫ్ మార్షల్ హోదాలో 2021 సెప్టెంబరులో పదవీ విరమణ చేశారు. త్వరలోనే ఆయనకు యూపీలోని ఒక లోక్‌సభ స్థానాన్ని బీజేపీ కేటాయించనుందని తెలుస్తోంది. 1980లో భారత వాయుసేనలో చేరిన భదౌరియాకు 26 విభిన్న రకాల యుద్ధ విమానాలను నడిపిన ట్రాక్ రికార్డు ఉంది. దాదాపు 4,250 గంటల పాటు యుద్ధవిమానాలు, సైనిక విమానాల్లో గడిపిన రికార్డు కూడా ఆయన పేరిట ఉంది. మొత్తం 36 సంవత్సరాల కెరీర్‌లో భదౌరియాకు అనేక పతకాలు లభించాయి. భదౌరియా ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఉన్న టైంలోనే ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి రూ.56వేల కోట్ల విలువైన ఒప్పందంపై చర్చలు కొలిక్కి వచ్చాయి. ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ కూడా 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం మోడీ కేబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్నారు.