Casting Couch : ‘‘హ‌ర్యానా కాంగ్రెస్‌లో కాస్టింగ్ కౌచ్ !?’’ : బీజేపీ నేత అమిత్ మాలవ్య

by Hajipasha |
Casting Couch : ‘‘హ‌ర్యానా కాంగ్రెస్‌లో కాస్టింగ్ కౌచ్ !?’’ : బీజేపీ నేత అమిత్ మాలవ్య
X

దిశ, నేషనల్ బ్యూరో : బీజేపీ ఐటీ సెల్ నేషనల్ కన్వీనర్ అమిత్ మాలవ్య ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మరో సంచలన వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో హర్యానాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు శారదా రాథోడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘చమ్డీ (శరీరం), దమ్డీ (డబ్బులు) ఆధారంగానే హర్యానాలో కాంగ్రెస్ పార్టీ టికెట్లను కేటాయించింది’’ అని శారదా రాథోడ్ చెబుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. అయితే శారదా రాథోడ్ పెదవుల కదలికలకు.. సదరు వీడియోలో ఉన్న ఆడియోకు సరైన పొందిక లేదు. దీంతో అది సరైన వీడియోనా ? ఫేక్ వీడియోనా ? అనేది తేలాల్సి ఉంది.

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఈ వీడియోను అమిత్ మాలవ్య పోస్ట్ చేయడం గమనార్హం. ‘‘గతంలో ఇలాంటి ఆరోపణలు చేసిన కేరళ కాంగ్రెస్ నాయకురాలు సిమి రోజ్‌బెల్‌ను కాంగ్రెస్ బహిష్కరించింది. ఇప్పుడు శారదా రాథోడ్‌ కూడా అలాంటి ఆరోపణలే చేశారు. కాంగ్రెస్ పార్టీలో కాస్టింగ్ కౌచ్ జరుగుతోందని ఆమె కూడా చెప్పారు’’ అని అమిత్ మాలవ్య తన ‘ఎక్స్’ పోస్టులో ఆరోపించారు. ఈ పోస్టులోనే శారదా రాథోడ్ సంచలన కామెంట్స్ చేసిన వీడియోను జతపరిచారు.

Next Story

Most Viewed