Parliament session: ఎంపీ చన్నీ వ్యాఖ్యల దుమారం.. బీజేపీ ఎంపీల ఆగ్రహం

by Shamantha N |
Parliament session: ఎంపీ చన్నీ వ్యాఖ్యల దుమారం.. బీజేపీ ఎంపీల ఆగ్రహం
X

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, లోక్ సభ కాంగ్రెస్ ఎంపీ చరణ్ జీత్ సింగ్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. జైళ్లో ఉన్న ఎంపీ అమృత్ పాల్ సింగ్ కేసును ఉటంకిస్తూ.. బీజేపీ అప్రకటిత ఎమర్జెన్సీ విధించిందన్నారు. ఇవి రాజకీయంగా దుమారం రేపాయి. చన్నీ వ్యాఖ్యలను లోక్ సభ రికార్డుల నుంచి తొలగించారు. కాగా.. చన్నీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడతున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా సోషల్ మీడియాలో ఘాటైన రిప్లై ఇచ్చారు. "కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం చన్నీ ఖలిస్థాన్ అనుకూల వేర్పాటువాది అమృతపాల్ సింగ్‌ కు మద్దతు ఇచ్చారు. ఇదేనా రాజ్యాంగ పరిరక్షణ?. భారతదేశం విచ్ఛిన్నం కావాలనుకునే వేర్పాటువాదుల కోసం మద్దతు తెలుపుతున్నారా? దీనిపై రాహుల్ సమాధానం చెప్పాలి. మాజీ ప్రధాని ఇందిరాజీ హత్యకు కారణమే ఖలిస్థానీ ఆలోచన. వేర్పాటువాదులు మరియు టెర్రరిస్టుల కోసం కాంగ్రెస్ ఎల్లప్పుడూ ఎందుకు మద్దతు తెలుపుతుంది. 26/11 జిహాదీలు ఇప్పుడు కె టెర్రరిస్టులా? అతని పోస్ట్ చేశారు.

బీజేపీ ఎంపీల ఆగ్రహం

పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీ చన్నీ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ఇందిరాగాంధీ హంతకుడు ఓ ఖలిస్తానీ.. అయినప్పటికీ, కాంగ్రెస్ ఖలిస్తానీకే మద్దతు ఇస్తోందన్నారు. “జై చన్నీ.. ఇది భారత సార్వభౌమాధికారంపై దాడి. దీనిపై చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ కా హాత్, ఖలిస్తానియన్ కే సాథ్(కాంగ్రెస్ మద్దతు, ఖలిస్తానీలకే)’’ అని మీడియాతో అన్నారు. చన్నీని కాంగ్రెస్ బహిష్కరించాలని బీజేపీ ఎంపీ దినేష్ శర్మ డిమాండ్ చేశారు. కెనడాలో ఉన్న దేశవ్యతిరేక శక్తుల ఆదేశానుసారం చన్నీ పని చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ అతనిపై చర్య తీసుకోకపోతే.. ఎక్కడో కాంగ్రెస్ సామాజిక, జాతీయ వ్యతిరేక శక్తులతో కుమ్మక్కయ్యిందని అర్థం అని పేర్కొన్నారు.

చన్నీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఏమందంటే?

చన్నీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఇప్పటికే దూరంగా ఉంది. "అమృతపాల్ సింగ్‌పై ఎంపీ చరణ్‌జిత్ సింగ్ చన్నీ వ్యక్తం చేసిన అభిప్రాయాలు అతని సొంతవి. ఇవి కాంగ్రెస్ వ్యాఖ్యలు కాదు. కాంగ్రెస్ పరిస్థితిని ఏ విధంగానూ ప్రతిబింబించవు" అని పార్టీ మీడియా ఇన్‌ఛార్జ్ జైరాం రమేష్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఇకపోతే, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా చన్నీ వ్యాఖ్యకు దూరంగా ఉన్నారు. ఇది ఆయన "వ్యక్తిగత అభిప్రాయం" అని అన్నారు.



Next Story