- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Manipur : మణిపూర్‌లోని ఆరు పోలీసు స్టేషన్ల పరిధిలో మళ్లీ ‘ఆఫ్‌స్పా’
దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్(Manipur)లోని ఆరు పోలీసు స్టేషన్ల పరిధిలో ఉన్న ఏరియాలను ‘ప్రభావిత ప్రాంతాలు’గా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఆయా ఏరియాలలో ‘సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం -1958’ (AFSPA) ఇక నుంచి అమలవుతుందని వెల్లడించింది. గత కొన్ని వారాల వ్యవధిలో మణిపూర్‌లోని పలు జిల్లాల్లో హింసాకాండ పెరిగింది. దీంతో బుధవారం రోజు 20 అదనపు పారామిలిటరీ కంపెనీల బలగాలను (2,500 మంది సిబ్బంది) మణిపూర్‌కు కేంద్ర హోంశాఖ పంపింది.
ఈ పరిణామం జరిగిన మరుసటి రోజే (గురువారం) ప్రభావిత ప్రాంతాల్లో ఆఫ్‌స్పా చట్టం అమలుపై హోం శాఖ నుంచి ప్రకటన వెలువడటం గమనార్హం. ఒకప్పుడు మణిపూర్‌లోని 19 పోలీసు స్టేషన్ల పరిధిలో ఆఫ్‌స్పా చట్టం అమలయ్యేది. అయితే వాటన్నింటికి గతంలో ఈ చట్టం నుంచి మినహాయింపు కల్పించారు. తాజాగా ఇప్పుడు వీటిలోని 6 పోలీసు స్టేషన్లను మరోసారి ఆఫ్‌స్పా చట్టం పరిధిలోకి తీసుకొచ్చారు.