Jacqueline Fernandez పై పరువు నష్టం దావా వేసిన Actor Nora Fatehi

by Harish |   ( Updated:2022-12-12 14:31:01.0  )
Jacqueline Fernandez పై పరువు నష్టం దావా వేసిన Actor Nora Fatehi
X

ముంబై: బాలీవుడ్ నటి నోరా ఫతేహి తన సహాచర నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు షాక్ ఇచ్చింది. రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో తన పరువుకు భంగం కలిగించేలా వ్యహరించారని ఆరోపిస్తూ జాక్వెలిన్‌తో పాటు 15 మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేసింది. మీడియా తన ఇమేజ్‌ను తగ్గించేలా వార్తలను విస్తృతం చేసిందని ఆరోపించింది. అంతేకాకుండా జాక్వెలిన్‌తో మీడియా సామరస్యంగా వ్యవహరిస్తుందని విమర్శించింది. సొంత ప్రయోజనాల కోసం జాక్వెలిన్ తనను నాశనం చేయాలని చూసిందని ఆరోపించింది.

ఈ చర్యలతో ఆర్థికంగా, సామాజికంగా, వ్యక్తిగతంగా తన క్లైయింట్‌కు సమస్యలు కలిగాయని నోరా ఫతేహి లాయర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో సంబంధాలున్నాయనే ఆరోపణలతో ఫెర్నాండెజ్‌తో పాటు నోరా ఫతేహి కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు కన్మాన్ సుఖేష్ చంద్ర నుంచి బాలీవుడ్ యాక్టర్లు ఖరీదైన బహుమతులు స్వీకరించారనే ఆరోపణలు ఉన్నాయి. నోరా ఫతేహి కూడా బహుమతులు తీసుకున్న వారిలో ఉన్నారని ఫెర్నాండెజ్ పేర్కొంది.

Next Story

Most Viewed