పరారీలో ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్ కర్ కుటుంబం..!

by Shamantha N |
పరారీలో ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్ కర్ కుటుంబం..!
X

దిశ, నేషనల్ బ్యూరో: ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్ కర్ కుటుంబం పరారీలో ఉంది. రైతును బెదిరించినందుకు పూజా తల్లిదండ్రులు సహా ఏడుగురిపై కేసు నమోదు అయ్యింది. అయితే, పూజా కుటుంబం పరారీలో ఉందని పూణే రూరల్ ఎస్పీ పంకజ్ దేశ్ ముఖ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ''నిందితులు పరారీలో ఉన్నారు. వారిని సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి. వాళ్ల ఇంటికి కూడా వెళ్లాం. కానీ అందుబాటులో లేరు” తెలిపారు. పూజా తల్లిదండ్రుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయని వివరించారు. క్రైమ్ బ్రాంచ్, స్థానిక పోలీసులతో సహా అనేక బృందాలు పూణే సహా సమీపంలోని ఫాంహౌజ్ లు, నివాసాల్లో వారి కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకున్నాక అసలు విషయాలు బయటకొస్తాయన్నారు. విచారణ జరిపాక దానికి తగినట్లుగా చర్యలు తీసుకుంటామన్నారు.

రైతుని బెదిరించిన పూజా తల్లి

రైతులను గన్ తో బెదిరించిన ఘటనలో పూజా తల్లిదండ్రులు దిలీప్, మనోరమా సహా ఏడుగురిపై రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహితలోని 323, 504, 506, 143, 144, 147, 148, 149 సెక్షన్ల కింద, ఆయుధ చట్టం కింద కేసు పెట్టారు. పూణేలోని ముల్షి తాలూకాలో కొంత మంది రైతుల్ని గ‌న్‌తో బెద‌రిస్తున్న‌ట్లు మ‌నోర‌మ ఖేడ్ కర్ చెందిన వీడియో వైర‌ల్ అయ్యింది. ఆ వీడియోని 2023 జూన్ లో రికార్డు చేసినట్లు భావిస్తున్నారు. అయితే, ఆత్మరక్షణ కోసమే తుపాకీ వాడినట్లు పూజా కుటుంబసభ్యుల తరఫున్ న్యాయవాది పేర్కొన్నారు. మ‌నోర‌మ దగ్గరున్న గ‌న్‌కు లైసెన్సు ఉందని తెలిపారు. అయితే, ఈ కేసులో విచారణ కోసం పూజ కుటుంబాన్ని సంప్రదించగా వారు అందుబాటులోకి రాలేదని, పరారీలో ఉన్నారని పోలీసుల తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed