లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌కు ఎదురుదెబ్బ.. 19 స్థానాల్లో వెనుకంజ

by Harish |
లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌కు ఎదురుదెబ్బ.. 19 స్థానాల్లో వెనుకంజ
X

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్ లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్‌‌ ఆద్మీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ రాష్ట్రంలో పోటీ చేసిన 13 స్థానాల్లో కేవలం 3 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. చాలా చోట్ల ఆప్ అభ్యర్థలు వెనుకంజలో ఉన్నారు. అలాగే, ఢిల్లీలోని నాలుగు నియోజకవర్గాల్లో కూడా వెనుకంజలో ఉంది. పంజాబ్ విషయానికి వస్తే, ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌, ఆప్‌లు హోరాహోరీగా తలపడగా, మొత్తం 13 స్థానాల్లో 7లో కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉంది. మిగిలిన మూడింటిలో అకాలీదళ్‌కు చెందిన హర్‌సిమ్రత్‌ కౌర్‌ ఒకదానిలో ముందంజలో ఉండగా, మరో ఇద్దరిలో స్వతంత్రులు ఉన్నారు.

ఆప్ ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంది. ఢిల్లీ, గుజరాత్, గోవా, హర్యానా, చండీగఢ్‌లలో కాంగ్రెస్‌తో కలిసి సీట్లను పంచుకుని పోటీ చేసినప్పటికి, పంజాబ్‌లోని 13, అస్సాంలోని రెండు నియోజకవర్గాల్లో మాత్రం ఒంటరిగా పోటీ చేసింది. మొత్తంగా ఆప్ పోటీ చేసిన 22 స్థానాల్లో 19 స్థానాల్లో వెనుకంజలో ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ గెలపుదిశగా పయనిస్తుంది. కౌంటింగ్ ప్రారంభంలో ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ కూడా ఇప్పుడు వెనుకంజలో ఉంది. ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్ జైలు నుంచి మధ్యంతర బెయిల్‌పై విడుదలై ప్రచారం చేసినప్పటికి కూడా ఢిల్లీలో ఆప్ బీజేపీకి గట్టి పోటీ ఇవ్వలేకపోయింది.

Advertisement

Next Story