పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థికి ఈసీ నోటీసులు

by Disha Newspaper Desk |
పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థికి ఈసీ నోటీసులు
X

న్యూఢిల్లీ: జాతీయ ఎన్నికల కమిషన్ పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్‌కు సోమవారం నోటీసులు జారీ చేసింది. ఆదివారం సంగ్రూర్ జిల్లాలో ప్రచార కార్యక్రమంలో కోవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో నోటీసులు ఇచ్చినట్లు పేర్కొంది. సంగ్రూర్ నుంచి ఎంపీగా ఉన్న భగవంత్ మాన్, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ధురి స్థానం పోటీ చేయనుండగా, ఆదివారం నుంచి తన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.

దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున జనం ఆయనకు స్వాగతం పలుకుతూ, నినాదాలు చేస్తూ వెంట వచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి. అయితే కొందరినే ఆహ్వానించగా, ఎక్కువ సంఖ్యలో జనం రోడ్లపైకి వచ్చారని ఆప్ ఆరోపించింది. ఈ నెల 8న ఎన్నికల తేదీలు ప్రకటిస్తూ, రోడ్ షోలు, పాదయాత్ర పై నిషేధం విధించింది. వచ్చే శనివారం నిబంధనలు అమల్లో ఉండనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed