ఢిల్లీ మంత్రి వర్గంలో అన్యూహ మార్పు..

by Vinod kumar |
ఢిల్లీ మంత్రి వర్గంలో అన్యూహ మార్పు..
X

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. మంత్రి సౌరవ్ భరద్వాజ్ వద్ద నుంచి సేవలు, విజిలెన్స్ విభాగాన్ని తొలగించి అతిషి మర్లెనాకు అప్పగించారు. ఢిల్లీలో గ్రూప్-ఎ అధికారుల నియామకాలు, బదిలీ అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించే బిల్లును పార్లమెంటు ఆమోదించిన మరుసటి రోజే కేజ్రీవాల్ మంత్రివర్గంలో మార్పులు చేయడం విశేషం.

ఆర్థిక, విద్య, ప్రభుత్వ పనుల విభాగం, రెవెన్యూ, టూరిజం, మహిళా శిశు సంక్షేమ శాఖలతో పాటు ఇప్పటికే 13 శాఖలు కలిగి ఉన్న అదితి చేతికి 14వ శాఖ వచ్చింది. దీంతో ఈ కేబినెట్ మంత్రి చేతిలో ప్రస్తుతం అత్యధిక ప్రభుత్వ విభాగాలు ఉన్నాయి. ఢిల్లీ ప్రభుత్వంలో అదితి ఏకైక మహిళా మంత్రిగా ఉన్నారు. భరద్వాజ్ చేతిలో ఆరోగ్యం, జల వనరులు, పట్టణాభివృద్ధి, పరిశ్రమలతో సహా ఇతర ఢిల్లీ ప్రభుత్వ విభాగాలు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed