- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీబీసీ ఆఫీస్‌పై రెయిడ్స్ కేసులో కీలక మలుపు
దిశ, డైనమిక్ బ్యూరో: బీబీసీ ఆఫీసులో ఐటీశాఖ నిర్వహించిన రెయిడ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీబీసీ భారీగా ఆదాయపన్నును ఎగవేసినట్లు తేలింది. ఈ విషయం బీబీసీ ఇండియా స్వయంగా అంగీకరించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఐటీ రిటర్న్స్‌లో బీబీసీ రూ.40 కోట్ల ఆదాయాన్ని తక్కువగా చూపినట్లు సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్‌కు బీబీసీ పంపిన మెయిల్‌లో పేర్కొన్నది. అయితే ఈ వ్యవహారాన్ని సాధారణ పద్దతిలో పరిష్కరించుకునేలా కనిపిస్తోంది. రివైజ్డ్ రిటర్న్స్‌లో భాగంగా వడ్డీతో సహా ఎగవేసిన డబ్బును ప్రభుత్వానికి కట్టడం అలాగే జరిమానాను సైతం భరించే దిశగా బీసీసీ ప్రయత్నిస్తోదని తెలుస్తోంది.
మరో వైపు నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేసిన టైమ్‌లో ఆ రాష్ట్రంలో చోటు చేసుకున్న అల్లర్ల నేపథ్యంలో బీబీసీ ఇటీవల ఓ డాక్యమెంట్రీని రూపొందించిది. ‘‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’’ పేరిట రూపొందించిన ఈ డాక్యుమెంటరీని రెండు భాగాలుగా బీబీసీ తీసింది. ఈ డాక్యుమెంటరీని భారత ప్రభుత్వం మన దేశంలో బ్యాన్ విధించింది. ఈ క్రమంలో గత ఫిబ్రవరిలో ముంబై, ఢిల్లీలో ఉన్న బీబీసీ కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టింది. తాజాగా ఐటీ పన్ను ఎగవేసినట్లు బీబీసీ అంగీకరించడం చర్చకు దారి తీస్తోంది.