Viral News: కర్ణాటకలో వింత ఆచారం.. ఈ పండుగ రోజు అక్కడ తేళ్లు కుట్టవట..

by Ramesh Goud |
Viral News: కర్ణాటకలో వింత ఆచారం.. ఈ పండుగ రోజు అక్కడ తేళ్లు కుట్టవట..
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా నాగుల పంచమి రోజు పాములను పూజిస్తే.. అక్కడ మాత్రం నాగులపంచమి రోజు తేళ్లను పూజిస్తూ.. తేళ్ల పండుగ జరుపుకుంటారు. ఈ వింత ఆచారం కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లాలోని కందుకూరు గ్రామంలో జరుగుతుంది. ఈ రోజున అక్కడ తేళ్లను శరీరంపై వేసుకొన్నా కుట్టవని ప్రజలు నమ్ముతారు. కర్ణాటక- తెలంగాణ బార్డర్ లోని కందుకూరు గ్రామంలో శ్రావణ మాసం ఆరంభంలో నాగుల పంచమి రోజున కొండా మహేశ్వర దేవత కొలువు తీరింది. దీంతో నాగుల పంచమి రోజు ఆ దేవతను దర్శించుకునేందుకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు.

అయితే అక్కడ ఓ వింత ఆచారాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈ రోజున కొండమవ్వ గుట్ట పై ఉన్న కొండమవ్వను దర్శించుకోవడంతో పాటు తేళ్ల విగ్రహాలను కూడా పూజిస్తారు. అంతేగాక గుట్టపై ఎక్కడ రాయిని కదిలించిన తేళ్లు దర్శనమిస్తాయని వాటిని శరీరంపై ఎక్కించుకున్న కుట్టవని నమ్ముతారు. అలాగే ఈ రోజు నాగుల పంచమి సందర్భంగా కొండమవ్వ దేవత దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దేవత దర్శనానంతరం గుట్టపై తేళ్లను తవ్వి తీసి, చిన్నా పెద్దా తేడా లేకుండా ఇష్టంగా తమ శరీరంపై వేసుకొని పారించుకుంటున్నారు. ఇది ఇక్కడి సాంప్రదాయం అని, నాగుల పంచమి రోజున తేళ్ల పండుగ జరుపుకుంటామని, ఈ రోజున ఒంటిపై తేళ్లను పారించుకున్నా కుట్టవని భక్తులు చెబుతున్నారు.

Advertisement

Next Story