- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తాగిన మత్తులో మహిళ బెర్తుపై మూత్ర విసర్జన చేసిన సైనికుడు
దిశ, నేషనల్ బ్యూరో: తాగిన మత్తులో ఉన్న ఒక సైనికుడు రైలులో తన బెర్తుపై మూత్ర విసర్జన చేశాడని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక మహిళ ఆరోపించింది. అయితే దీనిపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)కు ఫిర్యాదు చేస్తే వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె నేరుగా ప్రధానమంత్రి కార్యాలయం, రైల్వే మంత్రికి ఫిర్యాదు చేసింది. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌కు వెళ్తున్న గోండ్వానా ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన జరిగింది.
రైలులోని B-9 కోచ్‌లో, బెర్త్ నెంబర్ 24ను ఒక సైనికుడికి కేటాయించారు. దాని క్రింద బెర్త్ నెంబర్ 23లో బాధితురాలు, ఆమె 7 ఏళ్ల చిన్నారి ఉన్నారు. రైలు గ్వాలియర్ చేరుకుంటుందనగా తాగిన మైకంలో ఉన్న సైనికుడు మూత్ర విసర్జన చేయగా, అది కాస్త క్రింద బెర్తులో ఉన్న మహిళపై పడింది. వెంటనే ఆమె తన భర్త హిమాచల్ సింగ్‌కు సమాచారం అందించడంతో అతను రైల్వే హెల్ప్‌లైన్ 139కు ఫిర్యాదు చేయడంతో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో, ఆర్‌పీఎఫ్ సిబ్బంది ఫిర్యాదును స్వీకరించారు.
రైలు ఝాన్సీకి చేరుకున్నప్పుడు వారు బాధితురాలి వద్దకు చేరుకుని ఫోటోలు తీసి, లలిత్‌పూర్‌లో చర్యలు తీసుకుంటామని పేర్కొని తరువాత ఎటువంటి చర్యలు తీసుకోకుండా వెళ్లిపోయారని, ఆమె నేరుగా ప్రధానమంత్రి కార్యాలయం, రైల్వే మంత్రికి ఫిర్యాదు చేసింది. మరోవైపు ఆర్‌పీఎఫ్ ఇన్‌ఛార్జ్ అధికారి సంజయ్ ఆర్య బాధితురాలి ఫిర్యాదుకు స్పందించామని తెలిపారు. మేము వచ్చేసరికి ఈ సంఘటన జరిగిన కోచ్‌లోని సీట్ నంబర్ 23లో బాధిత మహిళ కనిపించలేదని, కానీ సైనికుడు మద్యం మత్తులో నిద్రపోతున్నాడని అతని ప్యాంటు తడిగా ఉందని పేర్కొన్నారు.