రాష్ట్రంలో అరుదైన ఘటన.. కడుపులో ఉన్న శిశువు పొట్టలో పిండం

by Jakkula Mamatha |
రాష్ట్రంలో అరుదైన ఘటన.. కడుపులో ఉన్న శిశువు పొట్టలో పిండం
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అరుదైన ఘటన వెలుగుచూసింది. ఓ గర్భిణి ఎనిమిది నెలల నుంచి ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంటుంది. ఈ క్రమంలో తొమ్మిదో నెలలో కూడా పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లింది. ఈ క్రమంలో ఆమెకు షాకింగ్ ఘటన ఎదురైంది. ఆ మహిళ కడుపులో (Pregnant woman) ఉన్న శిశువు పొట్టలో పిండం (Foetus inside foetus) ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. స్కానింగ్‌లో ఈ విషయం బయటపడినట్లు వైద్యులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మహరాష్ట్రలోని బుల్దానా (Buldhana) జిల్లాకు చెందిన 32 ఏళ్ల మహిళ తొమ్మిది నెలల గర్భిణి. ఈ క్రమంలో ఆమె జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది.

అయితే నెలలు నిండటంతో ఆమెకు వైద్యులు సోనోగ్రఫీ (sonography) పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో గర్భస్థ శిశువు కడుపులో పిండం ఉన్నట్లు బయటపడడంతో డాక్టర్లు షాక్‌కి గురయ్యారు. అయితే దీనిని ‘ఫీటస్‌ ఇన్‌ ఫీటూ’గా పిలుస్తారని వైద్యులు చెబుతున్నారు. ఆ గర్భిణి గత ఎనిమిది నెలలుగా అదే ఆసుపత్రిలో పరీక్షలు చేసుకుంటుందని.. ఎప్పుడు కూడా స్కానింగ్‌లో ఈ విషయం బయటపడలేదని డాక్టర్.గైనకాలజిస్ట్‌ ప్రసాద్‌ అగర్వాల్‌ (Dr. Prasad Agarwal) వెల్లడించారు.

తొమ్మిదో నెల(9 Months) కావడంతో చేసిన సోనోగ్రఫీ స్కానింగ్‌(sonography Scaning)లో మాత్రం ఈ విషయం వెలుగు చూసిందని వెల్లడించారు. అయితే ఇటువంటివి అరుదుగా జరుగుతాయని, తల్లి గర్భంలో కవలలు ఏర్పడే క్రమంలో అడ్డంకులు ఏర్పడడంతో ఇలా జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. పుట్టిన వెంటనే బిడ్డకు ప్రత్యేక సంరక్షణ అవసరమని చెప్పారు. అయితే ఇలాంటి అరుదైన కేసులు ప్రపంచ వ్యాప్తంగా కేవలం 200 మాత్రమే నమోదయ్యాయి. ఇండియాలో 15 – 20 కేసులు వెలుగు చూసినట్లు డాక్టర్లు వెల్లడించారు.


Next Story

Most Viewed