బర్త్ డే వేళ సచిన్కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ఫ్యాన్ (వీడియో)

by Javid Pasha |
బర్త్ డే వేళ సచిన్కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ఫ్యాన్ (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: ఇవాళ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 50వ బర్త్ డే అనే విషయం తెలిసిందే. ఏప్రిల్ 24న ఆయన బర్త్ డే సందర్భంగా ముంబైకి చెందిన ఓ ఫ్యాన్ ఆయనకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. 50వ బర్త్ డే సందర్భంగా సచిన్ కు సంబంధించిన 50 అడుగుల చిత్రపటాన్ని గీశాడు. దానిపై హ్యాపీ బర్త్ డే సచిన్ @50 అని రాశాడు. అలాగే ఆయనకు వచ్చిన అర్జున అవార్డ్ (1994), ఖేల్ రత్న (1998), పద్మశ్రీ (1999), పద్మ విభూషణ్ (2008), భారతరత్న(2014) గురించి కూడా ఆ చిత్రపటంపై పొందుపరిచాడు.కాగా భారత దేశంలో క్రికెట్ కు క్రేజ్ తీసుకురావడంలో సచిన్ క్రియాశీల పాత్ర పోషించారు. క్రికెట్ లో భారత్ కు ఎన్నో చిరస్మరణీయమై విజయాలు అందించారు. క్రికెట్ కు ఆయన చేసిన సేవను గుర్తించిన భారత ప్రభుత్వం భారతరత్న బిరుదుతో ఆయనను సత్కరించింది.

Advertisement
Next Story

Most Viewed