- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈయన మామూలోడు కాదు.. థియేటర్ లో 16 ఏళ్లలో 470 సినిమాలు చూశాడు
దిశ, వెబ్ డెస్క్: ఓటీటీ రాకతో నేడు థియేటర్లకు రావడమే తగ్గించేశారు ప్రేక్షకులు. ఏదో ఒక రోజు ఓటీటిలోకి ఆ సినిమా రాకపోదా.. అప్పుడు చూడమా అంటూ చాలా మంది థియేటర్ కు వెళ్లడమే మానేశారు. కానీ ఓ వ్యక్తి 16 ఏళ్లలో థియేటర్లలో 470 సినిమాలు చూసి రికార్డు సృష్టించాడు. అంతటితో ఆగకుండా తాను చూసిన సినిమాలను డేట్ ప్రకారం తన డైరీలో ఓ లిస్టు రాసుకున్నాడు. ప్రస్తుతం ఆ డైరీకి సంబంధించిన ఫోటోలు ఆ వ్యక్తి మనవడు సోషల్ మీడియాలో షేర్ చేయగా వేల సంఖ్యలో వ్యూస్, లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. ఇవ వివరాల్లోకి వెళ్తే..
తమిళనాడుకు చెందిన అక్షయ్ కుమార్ (ఏకే) అనే వ్యక్తి ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటాడు. అతడికి 1000కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ఆయన తన తాతకు సంబంధించిన ఓ డైరీని ట్విట్టర్ లో షేర్ చేశాడు. ‘‘ మా తాతకు సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆయన థియేటర్ లో చూసిన ప్రతి సినిమా వివరాలను తన డైరీలో రాసుకునేవాడు. అలా తన డైరీలో 1958 నుంచి 1974 వరకు తాను చూసిన మొత్తం 470 సినిమాలకు సంబంధించిన లిస్టు రాసి పెట్టుకున్నాడు. నాకు బాగా ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే మా తాత థియేటర్ కు వెళ్లి హిచ్ కాక్, జేమ్స్ బాండ్ సినిమాలు కూడా చూసేవాడు’’ అంటూ రాసుకొచ్చాడు.
ప్రస్తుతం ఈ డైరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాల మీద ఆ తాతకు ఉన్న ఇష్టాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ తాత సినిమాల కోసమే పుట్టినట్టున్నాడు అని ఓ నెటిజన్ అంటే.. ఒక్క నెలలో తాత చూసిన సినిమాల లిస్ట్ చూసి ఆశ్చర్యపోయా అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు.