- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
58 ఏళ్ల వయసులో గర్భం దాల్చిన ప్రముఖ సింగర్ తల్లి
దిశ, డైనమిక్ బ్యూరో: 2022లో ప్రముఖ పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్దూ మూసేవాలాను దారుణంగా హత్య చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సింగర్ తల్లి చరణ్ కౌర్ 58 ఏళ్ల వయసులో మరో బిడ్డకు జన్మనివ్వబోతోంది. చరణ్ కౌర్, బాల్ కౌర్ సింగ్ లకు సిద్దూ ఒక్కడే సంతానం, ఒక్కాగానొక్క కొడుకు చనిపోవడంతో వారు మరో బిడ్డను కనాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపధ్యంలోనే ఐవీఎఫ్ పద్దతి ద్వారా సిద్దూ తల్లి గర్భం దాల్చినట్లు చరణ్ కౌర్ సోదరుడు వెల్లడించారు. వచ్చే నెలలో డెలివరీ ఉండటంతో వైద్యుల సంరక్షణలో ఉన్నట్లు తెలిపారు.
కాగా సిద్దూ మూసేవాలా రెండేళ్ల క్రితం గ్యాంగ్ స్టర్ కాల్పుల్లో మరణించాడు. ప్రముఖ సింగర్ గా ప్రసిద్ది చెందిన సిద్దూ.. తేరీ మేరీ జోడీ, మోసా జఠ్ వంటి చిత్రాల్లో నటించాడు. 2021 లో కాంగ్రెస్ పార్టీలో చేరిన సిద్దూ.. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాన్సా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. ఎన్నికలు జరిగిన కొద్ది రోజులకే తన స్వగ్రామానికి వెళ్తుండగా, కొందరు దుండగులు అడ్డగించి కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ హత్యకు ప్రధాన సూత్రధారి గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అని ఢిల్లీ పోలీసుల విచారణలో తేలింది. ఇక త్వరలోనే జగరబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సిద్దూ తండ్రి కాంగ్రెస్ తరుపున పోటీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.