మెట్రో ట్రాక్‌పై డ్రోన్ కలకలం

by Sathputhe Rajesh |   ( Updated:2022-12-26 04:01:32.0  )
మెట్రో ట్రాక్‌పై డ్రోన్ కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: మెట్రో ట్రాక్‌పై డ్రోన్ కలకలం రేపింది. నిత్యం జనంతో రద్దీగా ఉండే మెట్రో సేవలు కొన్ని గంటల పాటు ట్రాక్‌పై డ్రోన్ కారణంగా నిలిచిపోయాయి. ఈ ఘటన ఆదివారం ఢిల్లీ మెట్రో ట్రాక్‌పై చోటు చేసుకుంది. దీంతో కొన్ని గంటల పాటు మెట్రోసేవలు నిలిచిపోయాయి. భద్రతా ఉల్లంఘనల కారణంగా లైన్ లోని సేవలను మూసివేశారు. ఈ లైన్ జనక్ పురిని నోయిడా బొటానికల్ గార్డెన్ స్టేషన్‌కు కలుపుతుంది. డీఎంఆర్‌సీ నెట్ వర్క్‌లో పొడవైన్ లైన్లలో ఒకటిగా ఉంది. డ్రోన్ 2.45 గంటలకు మెట్రో ట్రాక్‌పై పడటంతో సేవలు నిలిచినట్లు ఢిల్లీ మెట్రో ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. డ్రోన్ కారణంగా ఢిల్లీ పోలీసులు వెంటనే అప్రమత్తమై డాగ్ స్క్వాడ్‌తో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డ్రోన్‌లో ఔషధాలు ఉన్నట్లు గుర్తించారు. డ్రోన్‌కు డీజీసీఏ అనుమతి గురించి వివరాలు తెలుసుకుంటున్నామని వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story