Earthquake: పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీని తాకిన ప్రకంపనలు

by Harish |   ( Updated:2024-09-11 09:16:17.0  )
Earthquake: పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీని తాకిన ప్రకంపనలు
X

దిశ, నేషనల్ బ్యూరో: దాయాది దేశం పాకిస్తాన్‌లో భూకంపం సంభవించింది. బుధవారం మధ్యాహ్నం 12:58 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. పంజాబ్ ప్రావిన్స్‌లోని నైరుతి భాగంలో డేరా ఘాజీ ఖాన్ ప్రాంతానికి సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని వాతావరణ శాఖను ఉటంకిస్తూ స్థానిక మీడియా నివేదించింది. పాకిస్థాన్‌లోని పెషావర్, ఇస్లామాబాద్, లాహోర్‌ భూకంప ప్రభావానికి లోనయ్యాయి.

మరోవైపు ఉత్తర భారత రాష్ట్రాల్లో కూడా తేలికపాటి ప్రకంపనలు సంభవించాయి. న్యూఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, జమ్మూకశ్మీర్‌తో పాటు ఆఫ్ఘనిస్తాన్ అంతటా భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. ఒక యూజర్ సోషల్ మీడియాలో ఢిల్లీలో స్వల్పంగా ప్రకంపనలు వచ్చినట్లు తెలిపాడు. సీలింగ్ ఫ్యాన్లు, కుర్చీలు, ఇతర వస్తువులు కొద్దిసేపు వణుకుతున్నటు సోషల్ మీడియాలో వీడియోలు కూడా విడుదలయ్యాయి. జూన్ నెలలో ఢిల్లీలో భూకంపం రాగా నెలల వ్యవధిలోనే రెండోసారి ప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు మరింత డేటాపై అన్వేషణ చేస్తున్నారు.

Advertisement

Next Story