17 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి.. ఆపై ఆత్యాచారం

by Anjali |
17 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి.. ఆపై ఆత్యాచారం
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో అత్యాచార ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా.. ఇద్దరు దుండగులు 17 ఏళ్ల బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడిన ఘటన హ‌ర్యానాలోని గురుగ్రామ్ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. కాగా.. సందీప్, అశుతోష్ అనే ఇద్దరు వ్యక్తులు మైనర్‌ బాలికను కిడ్నాప్ చేసి ఆమెను లైంగికంగా వేధించి, గురుగ్రామ్‌లో ఓ ప్రదేశంలో వదిలేశారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న పోలీసులకు ఆ బాలిక కనిపించింది. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. సెక్షన్ 376(అత్యాచారం), లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం(పోక్సో చట్టం)తో పాటు ఇతర సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నామని డిప్యూటీ ఎస్పీ మహ్మద్ ఫహీమ్ తెలిపారు.

Advertisement

Next Story