లడఖ్‌లో 77.61 శాతం ఓటింగ్..

by Vinod kumar |
లడఖ్‌లో 77.61 శాతం ఓటింగ్..
X

శ్రీనగర్: కార్గిల్‌లోని లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో బుధవారం దాదాపు 77.61 శాతం ఓటింగ్ నమోదైంది. ఆగస్టు 2019లో ఆర్టికల్ 370ని రద్దు అనంతరం కేంద్ర పాలిత ప్రాంతంగా (UT) మారిన లడఖ్‌లోని కార్గిల్ జిల్లాలో నిర్వహించిన మొదటి కీలక పోల్ ఇదే. 26 స్థానాలకు గాను 85 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. ఆదివారం ఓట్ల లెక్కింపు జరగనుంది. పోలింగ్ సమయంలో చాలా మంది ఓటర్లు 370 రద్దు తర్వాత గుర్తింపు సమస్యలతో పాటు యూనియన్ టెరిటరీ పరిపాలనలో ప్రజాస్వామ్య ప్రాతినిథ్యం లేకపోవడం గురించి మాట్లాడారు.

అయితే రాష్ట్ర హోదా తిరిగి కావాలని.. యూటీగా ప్రకటించిన తర్వాత ఏమీ రాలేదని, తమ పిల్లలు నిరుద్యోగులుగా ఉన్నారని ఈ సందర్భంగా ఒక ఓటరు వెల్లడించాడు. మళ్లీ జమ్మూ కశ్మీర్‌తో కలపాలని కోరుకుంటున్నట్లు మరో ఓటరు తెలిపాడు. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌-కాంగ్రెస్‌ కూటమి మధ్య పోటీ నెలకొనగా.. 2019 నాటి కేంద్రం నిర్ణయాన్ని ప్రజలు ఆమోదించారా..? లేదా తెలుసుకోవడానికి ఈ ఎన్నికలను రెఫరెండంగా చూస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed