నాణ్యతా పరీక్షల్లో ఫెయిల్ అయిన పారాసిటమాల్‌ సహా 52 ఔషధాలు

by S Gopi |
నాణ్యతా పరీక్షల్లో ఫెయిల్ అయిన పారాసిటమాల్‌ సహా 52 ఔషధాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: విస్తృతంగా వాడుకలో ఉన్న పారాసిటమాల్, గ్యాస్టిక్ కోసం వాడే పాంటొప్రజొల్ సహా 52 యాంటిబయోటెక్‌ ఔషధాలు నాణ్యతా పరీక్షల్లో విఫలమైనట్టు జాతీయ నాణ్యత నియంత్రణ సంస్థ(సీడీఎస్‌సీఓ) పేర్కొంది. ఈ ఏడాది మేలో సీడీఎస్‌సీఓ జారీ చేసిన నివేదిక ప్రకారం, ఈ నాణ్యత లేని ఔషధాల్లో 22 హిమాచల్‌ప్రదేశ్‌లో తయారు చేయబడ్డాయి. అలాగే, గుజరాత్‌లోని జైపూర్, హైదరాబాద్, వాఘోడియా, వడోదర, ఆంధ్రప్రదేశ్, ఇండోర్ ప్రాంతాల నుంచి ఆయా ఔషధాల నమూనాను సేకరించామని సీడీఎస్‌సీఓ వెల్లడించింది. సంబంధిత ఫార్మాస్యూటికల్ కంపెనీలకు ప్రభుత్వ డ్రగ్ రెగ్యులేటర్లు నోటీసులు పంపారని, క్వాలిటీ టెస్టుల్లో ఫెయిల్ అయిన శాంపిల్స్‌ను మార్కెట్ నుంచి రీకాల్ చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. పరీక్షలు నిర్వహించిన ఔషధాల్లో మూర్చ, ఆందోళన వంటి వాటికి చికిత్స కోసం ఉపయోగించే క్లోనజెపమ్, నొప్పి నివారణకు వాడే డిక్లొఫెనాక్, యాంటీ హైపర్‌టెన్షన్ డ్రగ్ టెల్మిసార్టన్, శ్వాసకోశ వ్యాధుల చికిత్సకు వాడే ఫ్లూకోనజల్ సహా పలు మల్టీ విటమిన్, కాల్షియం మాత్రలు ఉన్నాయి. గతేడాది కూడా హిమాచల్‌ప్రదేశ్‌లో తయారైన 120 ఔషధాలు నాణ్యతా పరీక్షల్లో ఫెయిల్ అయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed