Bangladesh Protests: బంగ్లాదేశ్ నుంచి స్వదేశానికి వచ్చిన భారత పౌరులు

by Shamantha N |
Bangladesh Protests: బంగ్లాదేశ్ నుంచి స్వదేశానికి వచ్చిన భారత పౌరులు
X

దిశ, నేషనల్ బ్యూరో: రిజర్వేషన్ల విధానం వల్ల బంగ్లాదేశ్(Bangladesh) అట్టడుకుతోంది. గత కొంతకాలంగా బంగ్లాలో నిరసనలు మిన్నంటాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారి 105 మంది చనిపోయారు. కాగా.. అక్కడున్న భారతీయులు స్వదేశానికి తిరిగొస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 450 మంది భారతీయులు సరిహద్దులు దాటి మేఘాలయకు చేరుకున్నారు. భారతీయులే కాక నేపాల్ (Nepal), భూటాన్(Bhutan) దేశాలకు చెందిన 600 మంది విద్యార్థులు ఆశ్రయం కోసం మేఘాలయ చేరుకున్నట్లు ఆరాష్ట్ర హోంశాఖ అధికారులు తెలిపారు.

మేఘాయల హోంశాఖ ఏమందంటే?

శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 245 మంది భారతీయు సరిహద్దులు దాటినట్లు మేఘాలయ హోంశాఖ తెలిపింది. వారితో పాటు 13 మంది నేపాలీలు కూడా ఉన్నారంది. ఇక, శనివారం తెల్లవారుజాముల మరో 363 మంది మేఘాలయాకు వచ్చినట్లు పేర్కొంది. వీరిలో 204 మంది భారతీయులు, 158 మంది నేపాలీ విద్యార్థులు, ఒక భూటాన్ వ్యక్తి ఉన్నారు. స్వదేశానికి తిరిగొచ్చిన భారతీయుల్లో ఎక్కువమంది వైద్య విద్యార్థులే ఉన్నారు. వీరిని ఉత్తర్‌ప్రదేశ్‌, హర్యానా, మేఘాలయ, జమ్ముకశ్మీర్‌కు చెందినవారిగా అధికారులు గుర్తించారు. కాగా.. బంగ్లాదేశ్ లో చెలరేగిన హింసపై విదేశాంగ శాఖ స్పందించింది. 8 వేల మంది విద్యార్థులు సహా 15వేల మంది బంగ్లాదేశ్ లో ఉన్నట్లు పేర్కొంది. వారికి సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నమని స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed