- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐఎన్ఎస్ 'రణవీర్'లో పేలుడు.. ముగ్గురు నౌకాదళ సిబ్బంది మృతి
ముంబై: భారత నౌకాదళ షిప్(ఐఎన్ఎస్) 'రణవీర్'లో మంగళవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు నౌకాదళ సిబ్బంది మృతి చెందారు. ఈ విషయాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 'ముంబై డాక్‌యార్డు(రేవు) వద్ద ఉన్న ఐఎన్ఎస్ రణవీర్‌లోని ఇంటర్నల్ కంపార్ట్‌మెంట్ ఆన్‌బోర్డులో దురదృష్టవశాత్తు సంభవించిన పేలుడులో ముగ్గురు సిబ్బంది తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు' అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
నౌకలోని ఇతర సిబ్బంది పరిస్థితి వెంటనే అదుపులోకి తేవడంతో ఆస్తి నష్టం జరగలేదని పేర్కొంది. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి దర్యాప్తునకు ఆదేశించినట్టు తెలిపింది. శత్రు నౌకలను ధ్వంసం చేయగలిగే ఐఎన్ఎస్ రణవీర్ గతేడాది నవంబర్ నుంచి తూర్పు నౌకాదళ కమాండ్ వద్ద విధులు నిర్వర్తిస్తోంది. రణవీర్ శ్రేణిలోని తొలి నౌక 1986 ఏప్రిల్ 21న నౌకాదళంలోకి ప్రవేశించింది. వీటిని మాజీ సోవియేట్ యూనియన్‌లో రూపొందించారు.