Uttarakhand: కేదార్ నాథ్ లో విషాదం.. కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి

by Shamantha N |
Uttarakhand: కేదార్ నాథ్ లో విషాదం.. కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో(Kedarnath) విషాదం జరిగింది. భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగి పడి ముగ్గురు యాత్రికులు చనిపోయారు. పలువురు శిథిలాలు కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ హైకింగ్ మార్గంలో గౌరీ కుండ్ సమీపంలో ఆదివారం ఉదయం కొండచరియలు విరిగి పడి ప్రమాదం జరిగింది. శిథిలాల నుంచి ముగ్గురు యాత్రికుల(pilgrims) మృతదేహాలను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో మరో ఎనిమిది మంది గాయపడ్డారు. అయితే, వీరంతా మహారాష్ట్రకు చెందిన వారని సమాచారం. స్పాట్ లో ఎన్డీఆర్‌ఎఫ్, డీడీఆర్, వైఎంఎఫ్ అడ్మినిస్ట్రేషన్ బృందంతో సహా యాత్రా మార్గంలోని భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ టీమ్ శిథిలాల నుంచి ముగ్గురి మృతదేహాలను బయటకు తీసిందని, గాయపడిన ఎనిమిది మందిని ఆస్పత్రికి తరలించారని తెలిపారు.

స్పందించిన ఉత్తరాఖండ్ సీఎం

కాగా.. ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి(Pushkar Singh Dhami ) విచారం వ్యక్తం చేశారు. కేదార్‌నాథ్ యాత్రా మార్గం సమీపంలో కొండపై నుండి పడుతున్న రాళ్ల కారణంగా కొందరు యాత్రికులు మృతిచెందారన్న వార్త చాలా బాధ కలిగిందన్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి వెంటనే మెరుగైన వైద్యం అందించాలని సీఎం అధికారులకు సూచనలు జారీ చేశారు.


Advertisement

Next Story

Most Viewed