1971 India-Pakistan War: పశ్చిమ త్రిపురలో యుద్ధం 27 మోర్టార్ షెల్స్ లభ్యం

by Shamantha N |
1971 India-Pakistan War: పశ్చిమ త్రిపురలో యుద్ధం 27 మోర్టార్ షెల్స్ లభ్యం
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ త్రిపురలో 1971 భారత్- పాకిస్థాన్ యుద్ధం నాటి 27 మోర్టార్ షెల్స్ (27 Mortars Shells) లభ్యమయ్యయాయి. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. దులాల్ నామా సమీపంలోని ఇంటి దగ్గర కూలీలు తవ్వకాలు జరిపుతుండగా ఇవి బయటపడ్డాయి. మొదట 12 మెర్టార్ షెల్స్ లభ్యం కాగా.. తర్వాతి తవ్వకాల్లో మరో 15 మందుగుడ్ల లభ్యం అయ్యాయి. సుమారు 50 సంవత్సరాల నాటివని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ మందు గుండ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని బముటియా ఔట్‌పోస్ట్ అధికారి తెలిపారు.

ముక్తి బాహిని

బంగ్లాదేశ్ స్వాతంత్య్ర సమరయోధులుగా(Bangladesh freedom fighters) పిలిచే ముక్తి బాహిని సభ్యులు ఈ మందుగుండ్లను పూడ్చి పెట్టి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ అనంత దాస్ ధ్రువీకరించారు. ”మందు గుండ్లు తీవ్రంగా దెబ్బతిన్నట్లు కనిపిస్తున్నాయి. వాటిపై లేబుల్ పోవడం కారణంగా వాటి కచ్చితమైన మూలాలు, తయారీ వివరాలను గుర్తించడం కష్టమవుతుంది” అని ఆయన పేర్కొన్నారు. ఆర్మ్స్ ఎక్స్ పర్ట్స్ మాత్రమే వాటి గురించి పూర్తి వివరాలు తెలపగలరని అన్నారు. ఇకపోతే, 1971 యుద్ధంలో బంగ్లాదేశ్ విముక్తిలో కీలకపాత్ర పోషించిన ముక్తి బాహిని.. త్రిపుర సరిహద్దును పాక్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడేందుకు వ్యూహాత్మక స్థావరంగా వాడుకుంది.

Advertisement

Next Story

Most Viewed