బిగ్ బ్రేకింగ్: 2022 సివిల్స్ తుది ఫలితాలు విడుదల

by Satheesh |   ( Updated:2023-05-23 09:01:52.0  )
బిగ్ బ్రేకింగ్: 2022 సివిల్స్ తుది ఫలితాలు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: సివిల్స్ 2022 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇవాళ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 933 మంది వివిధ విభాగాల్లో సివిల్స్ సర్వీసెస్‌కు ఎంపిక అయినట్లు ప్రకటించింది యూపీఎస్సీ. కాగా, 2022 సివిల్స్ తుది ఫలితాల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇషితా కిశోర్‌ మొదటి ర్యాంక్ సాధించినట్లు యూపీఎస్సీ వెల్లడించింది. ఇక, ఇవాళ విడుదలైన సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. తిరుపతికి చెందిన పవన్ దత్తాకు 22వ ర్యాంక్.. శాఖమూరి శ్రీసాయి హర్షిత్‌కు 40వ ర్యాంక్, హెచ్ఎస్ భావన 55 ర్యాంక్, ఆవుల సాయికృష్ణ 94వ ర్యాంక్, వసంత్ కుమార్ 157వ ర్యాంక్, కమతం మహేష్ కుమార్ 200 ర్యాంక్ సాధించారు.

Advertisement

Next Story