- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సిరియాలో ఊచకోతలు.. 600 మంది మృతి

- రెండు గ్రూపుల మధ్య దాడులు, ప్రతీకార హత్యలు
- 14 ఏళ్ల సిరియా సంక్షోభంలో ఇదే అతిపెద్ద మారణకాండ
- రోడ్లు, వీధుల్లో శవాల గుట్టలు
- ప్రాణభయంతో కొండల్లోకి పారిపోయిన ప్రజలు
దిశ, నేషనల్ బ్యూరో: రాజకీయ సంక్షోభం, అంతర్యుద్దంతో అల్లకల్లోలంగా మారిన సిరియాలో అతిపెద్ద మారణకాండ చోటు చేసుకుంది. భద్రతా దళాలు, బహిష్కరణకు గురైన ప్రెసిడెంట్ బషార్ అసాద్ విధేయుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు కాస్తా.. హింసా కాండకు దారి తీసింది. ఈ దాడులు, ప్రతీకార హత్యల కారణంగా 600 మందికి పైగా మృత్యువాత పడినట్లు సిరియా పరిస్థితిని మానిటర్ చేస్తున్న ఒక సంస్థ శనివారం తెలిపింది. 14 ఏళ్ల సిరియా సంక్షోభంలో ఇంత దారుణమైన మారణకాండ చోటు చేసుకోవడం ఇదే తొలి సారని తెలుస్తుంది. గురువారం మొదలైన ఘర్షణలు మరింతగా ముదరడంతో సిరియాలో ఏర్పడిన కొత్త సర్కారుకు ఇబ్బందిగా మారింది. అసాద్‌ను పదవీచ్యుతుడ్ని చేసిన తర్వాత తిరుగుబాటుదారులు సిరియాలో అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. అయితే బషార్ అసద్ విధేయులే ఈ హింసాకాండకు బాధ్యత వహించాలని, ఇలాంటి వ్యక్తిగతమైన చర్యలు తగదని కొత్త ప్రభుత్వం అంటోంది.
శుక్రవారం ప్రభుత్వానికి విధేయులైన సున్నీ ముస్లింలు ఆయుధాలు చేపట్టి.. అసద్ వర్గానికి చెందిన మైనార్టీలైన అలావైట్ గ్రూపుపై దాడులకు తెగబడ్డారు. దశాబ్దాలుగా అలావైట్ ప్రాంతం అసాద్‌కు సపోర్ట్ బేస్‌గా ఉంటూ వస్తోంది. ఈ ప్రాంతంపై సున్నీ ముస్లింలు దాడి చేసి అలావైట్లను దారుణంగా చంపేశారు. దుకాణాలు, ఇండ్లలోకి చొరబడి దొరికిన వారిని దొరికినట్లు కాల్చేశారు. వీధుల్లో, రోడ్లపై ఈ కాల్పుల కారణంగా వందలాది మంది మృతి చెందారు. పైగా అలావైట్ల ఇండ్లలోకి చొరబడి సామాన్లు లూటీ చేశారు. అనంతరం ఇండ్లను తగలబెట్టినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఇక బనియాస్ ప్రాంతంలో కూడా హింసాకాండ చెలరేగింది. అక్కడ ప్రతీ వీధిలో, రోడ్లపై, ఇండ్ల పైకప్పులపై శవాల గుట్టలు పేరుకొని పోయాయి. వాటిని తీసుకొని పోవడానికి కూడా సున్నీ ముస్లింలు ఒప్పుకోలేదని తెలిసింది.
బషార్ అసాద్‌కు మద్దతుగా ఉన్నందుకే ఈ ప్రతీకార హత్యలు జరిగినట్లు తెలిసింది. ఈ హింసాకాండకు భయపడి చాలా మంది తమ కుటుంబాలతో సహా పర్వత ప్రాంతాలకు వెళ్లి దాక్కున్నట్లు సమాచారం. బ్రిటన్‌లని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ ఈ యుద్దాన్ని మానిటర్ చేస్తుంది. దీనికి బాధ్యుడైన రమీ అబ్దుర్‌రెహ్మన్ మాట్లాడుతూ 428 మంలి అలావైట్లు ఈ ఎటాక్‌లో చనిపోయారని తెలిపారు. దీంతో పాటు 120 మంది అసద్ ఫైటర్లు, 89 మంది భద్రతా సిబ్బంది కూడా మరణించినట్లు పేర్కొన్నారు. అయితే శనివారం ఈ ప్రతీకార హత్యలు ఆగిపోయినట్లు రమీ తెలిపారు. అయితే కచ్చితంగా ఎంత మంది మరణించారనే విషయం ఇంకా వెల్లడి కాలేదని అన్నారు.
Read More ....
Russia: ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా భారీ దాడి..14 మంది మృతి