Jammu Kashmir : కశ్మీర్‌లో ఉగ్రదాడి.. అమరులైన ఇద్దరు సైనికులు

by Hajipasha |
Jammu Kashmir : కశ్మీర్‌లో ఉగ్రదాడి.. అమరులైన ఇద్దరు సైనికులు
X

దిశ, నేషనల్ బ్యూరో : కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన వేళ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరోసారి బరితెగించారు. జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో భారత భద్రతా బలగాలపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. అమరులైన భారత సైనికులను నాయబ్ సుబేదార్ విపన్ కుమార్, సిపాయ్ అర్వింద్ సింగ్‌లుగా గుర్తించారు. ఈ ఘటనలో మరో ఇద్దరు భారత సైనికులకు గాయాలయ్యాయి. కిష్త్వార్‌‌‌ పట్టణంలోని ఛాత్రూ ఏరియాలో ఈ ఉగ్రదాడి చోటుచేసుకుందని భారత సైన్యం వెల్లడించింది. ఛాత్రూ ఏరియాలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయనే సమాచారం అందడంతో శుక్రవారం తెల్లవారుజాము నుంచే భారత ఆర్మీ అక్కడ కార్బన్ సెర్చ్ ఆపరేషన్‌ను మొదలుపెట్టింది.

ఈక్రమంలో మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఉగ్రవాదుల జాడను భద్రతా బలగాలు గుర్తించారు. దీంతో సైన్యం, ఉగ్రవాదుల మధ్య భీకరంగా కాల్పులు, ప్రతికాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిగిన కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు అమరులయ్యారు. మరోవైపు కశ్మీర్‌లోని ఖాండారా కథువా వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వారి నుంచి అమెరికా తుపాకీ, ఏకే 47 రైఫిల్, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed