- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెజ్లర్ల ఇష్యూపై 1983 వరల్డ్ కప్ విజేతల రియాక్షన్ ఇదే
దిశ, వెబ్ డెస్క్: భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను వేధించారంటూ భారత మహిళా రెజ్లర్లు చేస్తున్న నిరసనలపై 1983 వరల్డ్ కప్ టీం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా 1983 వరల్డ్ కప్ టీం ఆటగాడు మదన్ లాల్ మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న రెజ్లర్లపై పోలీసుల తీరు సరిగా లేదని విమర్శించారు. వాళ్లను అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు వ్యవహారం చాలా అభ్యంతరకరంగా ఉందని అన్నారు. అదేవిధంగా తాము సాధించిన మెడల్స్ ను గంగా నదిలో పారేస్తామంటూ రెజ్లర్లు ప్రకటించారని, అది చాలా బాధాకరమని అన్నారు. ఎన్నో ఏళ్ల కష్టం, త్యాగం, పట్టుదలకు ఆ మెడల్స్ నిదర్శమని అన్నారు.
ఆ మెడల్స్ కేవలం ఆటగాళ్లకే కాదని జాతి యావత్తుకు చెందిన సంపద అని స్పష్టం చేశారు. మెడల్స్ ను నదిలో పడేయడంపై పునరాలోచించాలని భారత వెటరన్ క్రికెటర్లు రెజ్లర్లకు సూచించారు. త్వరలోనే రెజ్లర్ల సమస్యలకు పరిష్కారం లిభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని మదన్ లాల్ కోరారు. కాగా బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ ను వెంటనే పదవి నుంచి తొలగించి అరెస్ట్ చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు.