2040 నాటికి సముద్రాల్లో ప్లాస్టిక్ వ్యర్ధాలు మూడు రెట్లు.. సర్వేలో కీలక విషయాలు

by Vinod kumar |
2040 నాటికి సముద్రాల్లో ప్లాస్టిక్ వ్యర్ధాలు మూడు రెట్లు.. సర్వేలో కీలక విషయాలు
X

సింగపూర్: సముద్రంలో కలుస్తున్న ప్లాస్టిక్ 2040 నాటికి మూడింతలకు చేరుతుందని తాజా సర్వే వెల్లడించింది. 1979 నుంచి 2019 వరకు దాదాపు 12 వేలకు పైగా శాంపిల్స్‌ను అట్లాంటిక్, పసిఫిక్, హిందు మహా సముద్రం, మధ్యదర సముద్రాల వద్ద పాయింట్ల నుంచి అంతర్జాతీయ శాస్త్రవేత్తలు/పరిశోధకులు నివేదికలను విశ్లేషించినట్లు తెలిపారు. 2005 తర్వాత సముద్రాల్లో వేగవంతమైన ప్లాస్టిక్ కాలుష్యం పెరుగుతున్నట్లు వారు గుర్తించారు.


‘నేడు సరాసరి 1.1 నుంచి 4.9 మిలియన్ టన్నుల 82-358 ట్రిలియన్ ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో విస్తరించాయి. 1990 వరకు తీవ్రంగా లేకపోయినప్పటికీ, 2005 తర్వాత ఇది క్రమంగా పెరిగింది’ అని అధ్యయనంలో తెలిపింది. కేవలం 14 ఏళ్లలోనే 16 ట్రిలియన్ల నుంచి ఈ సంఖ్య 171 ట్రిలియన్లకు చేరిందని పేర్కొంది. దీనిపై వెంటనే అత్యవసర కార్యాచరణ చేపట్టకపోతే 2040 నాటికి దాదాపు 2.6 రెట్లకు వ్యర్థాలు పెరుగుతాయని హెచ్చరికలు చేసింది.

9 శాతమే రిసైక్లింగ్‌కు..

ప్రపంచవ్యాప్తంగా 9 శాతం ప్లాస్టిక్ రిసైక్లింగ్ అవుతున్నట్లు 5 జైర్స్ ఇనిస్టిట్యూట్ పరిశోధన, అవిష్కరణ డైరెక్టర్ లీసా ఎర్డిల్ అన్నారు. ఒక్కసారి ప్లాస్టిక్ సముద్రంలోకి వెళ్తే నిర్వీర్యం కాదని, ముక్కలుగా విడిపోతుందని చెప్పారు. ఈ ముక్కలను అంత సులువుగా తొలగించలేమని అవి అంటుకు పోతాయని చెప్పారు. ‘సముద్రం అనేది సంక్లిష్టమైన ప్రదేశం. భూమిపై అనేక సముద్రపు ప్రవాహాలు చాలా ఉన్నాయి, వాతావరణం, భూమిపై పరిస్థితుల కారణంగా కాలక్రమేణా మార్పులు ఉన్నాయి’ అని ఎర్డిల్ తెలిపారు. నార్త్ అట్లాంటిక్ సముద్రంలో అత్యధిక ప్లాస్టిక్ ఉందని పరిశోధకులు గుర్తించారు. అయితే మధ్యదరా, హిందు మహా సముద్రం, దక్షిణ అట్లాంటిక్, దక్షిణ పసిఫిక్‌ల నుంచి ఇంకా సమాచారం రావాల్సి ఉందని చెప్పారు.

అత్యవసర కార్యచరణ అవసరం..

2000 సంవత్సరానికి ముందు కాలుష్యాన్ని నియంత్రించే ఒప్పందాలు లేదా విధానాల ప్రభావం తీవ్రంగా లేకపోవడమే సముద్రాల్లో ప్లాస్టిక్ అధికమవ్వడానికి కారణమని అధ్యయనం పేర్కొంది. 1980వ దశకంలో అనేక చట్టబద్ధమైన అంతర్జాతీయ ఒప్పందాలను ఖచ్చితం చేయాలని తెలిపింది. అయితే ఇవి స్వచ్ఛంద ఒప్పందాలు కావడంతో తక్కువ ప్రభావవంతంగా ఉండవచ్చని అభిప్రాయపడింది. ఈ కారణంగానే 2000 తర్వాత ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగాయని భావించింది.


అయితే ప్లాస్టిక్ ఉత్పత్తితో పాటు వాడకాన్ని తగ్గించడంపై ముఖ్యంగా దృష్టి పెట్టడమే సమస్యకు పరిష్కారమని పరిశోధకులు వాదిస్తున్నారు. సముద్రాలను శుద్ధీకరించడం, ప్లాస్టిక్ రిసైకిల్ చేయడం ఇదే ఉత్తమమని తెలిపారు. ప్రపంచ మహాసముద్రాలకు అనుకుని బీచ్‌లలో చర్యలు చేపట్టాలని.. తక్షణ అంతర్జాతీయ విధాన జోక్యాలు అవసరమని నివేదకి తెలిపింది. అయితే మానవాళిగా కూడా బాధ్యతగా వ్యవహరిస్తూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడంపై దృష్టి సారించాలని నివేదిక కోరింది.

Advertisement

Next Story

Most Viewed