Mexico: మెక్సికోలోని బార్ లో కాల్పులు.. 10 మంది మృతి

by Shamantha N |
Mexico: మెక్సికోలోని బార్ లో కాల్పులు.. 10 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: మెక్సికోలోని(Mexico) క్వెరెటారోలోని(Queretaro) బార్‌లో కొందరు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కాల్పుల్లో 10 మంది మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నలుగురు సాయుధులు బార్‌లోకి ప్రవేశించి అక్కడ కూర్చున్న వారు, సిబ్బందిపై కాల్పులు ప్రారంభించారు. దాడి ఎలా జరిగింది? మొత్తం ఘటనపై పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. రానున్న గంటల్లో ఆ ప్రాంతంలో భద్రతను పెంచుతామని అధికారులు తెలిపారు. అయితే, దుండగులు ఎందుకు కాల్పులు జరిపారనేది ఇంకా తెలియరాలేదు.

రెండ్రోజుల క్రితం ఘర్షణ

అయితే, మెక్సికో ప్రాంతంలో ఇప్పటికే హింస కొనసాగుతోంది. ఈ ప్రాంతాల్లో హింస పెరగడం కూడా ఈ ఘర్షణలతో ముడిపడి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కాగా.. ప్రాంతీయ ఘర్షణలకు సంబంధించిన హింస కారణంగా ఈ దాడి జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మెక్సికోలో హింస చెలరేగడంతో పాటు రోజురోజుకు ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. రెండ్రోజుల క్రితం ఓ సీఫుడ్ రెస్టారెంట్‌లో ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారు.

Advertisement

Next Story